తమిళ క్రేజీ హీరో తో త్రివిక్రమ్ సినిమా .. ఇది సౌత్ ఇండియా కి టాప్ మోస్ట్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ !!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరు త్రివిక్రమ్. ఈ ఏడాది ప్రారంభంలో “అలా వైకుంఠపురం లో” అనే సినిమా చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర “బాహుబలి” రికార్డులను బద్దలు కొట్టే రేంజులో బన్నీ కి అదిరిపోయే హిట్ అందించాడు. అటువంటి త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకులంతా పాన్ ఇండియా జపం చేస్తున్న సంగతి తెలిసిందే.

trivikram-surya-film | Telugu Mirchi | Movies | Politics | Movie Review |  Gossips | Telugu Cinemaఇటువంటి తరుణంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఆ తరహాలోనే సినిమా చేయడానికి పూనుకున్నట్లు దీనిలో భాగంగా తమిళ క్రేజీ హీరో సూర్యతో సినిమా చేయడానికి రెడీ అయినట్లు, ఇది సౌత్ ఇండియాలోనే రిలీజ్ అయ్యేలా స్టోరీ లైన్ రెడీ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్లు వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

 

కానీ తాజాగా త్రివిక్రమ్ సూర్యా కి ఓ స్టోరీ లైన్ వినిపించినట్లు సూర్య కూడా ఓకే అన్నట్లు టాక్. సూర్యకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉంది. దీంతో పాటు తమిళంలో మరియు కొన్ని సౌత్ ఇండస్ట్రీలలో సూర్య సినిమాలకు మంచి డిమాండ్ వుంది. వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ సూర్యా కి ఓ స్టోరీ సిద్ధం చేసినట్లు సమాచారం. అంతా అనుకున్నట్టు సూర్యతో త్రివిక్రమ్ సినిమా కన్ఫామ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయితే సౌత్ ఇండియా కే ఇది టాప్ మోస్ట్ బ్లాక్ బస్టర్ అవటం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంటున్నారు.