SSMB 28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే టైం గడిచింది. 2020లో సంక్రాంతి పండుగ కానుకగా బన్నీతో చేసిన “అలా వైకుంఠపురం లో” సినిమా తరువాత మరో సినిమాకు ఇప్పటి వరకు త్రివిక్రమ్ సొంత దర్శకత్వం చేయలేదు. పవన్ కళ్యాణ్ నటించిన “బిమ్లా నాయక్” కి డైలాగులు స్క్రీన్ ప్లే ఇచ్చిన త్రివిక్రమ్ ఆ తర్వాత ప్రస్తుతం మహేష్ బాబుతో కొత్త సినిమా చేయడానికి రెడీ కావడం తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వాస్తవానికి ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. అధికారిక ప్రకటన వచ్చినా గానీ ఎన్టీఆర్ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇదిలా ఉంటే కరోనా కారణంగా రెండు సంవత్సరాలకు పైగా గ్యాప్ రావడంతో.. మహేష్ సినిమా అతి తక్కువ టైంలో కంప్లీట్ చేసే దిశగా త్రివిక్రమ్ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. విషయంలోకి వెళితే సినిమాకి సంబంధించి భారీ కాస్టింగ్ నటీనటులతో ముందుగా సన్నివేశాలు కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ సరికొత్త షెడ్యూల్ సెట్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఆ తర్వాత చివరిలో యాక్షన్ మరియు పాటల చిత్రీకరణ కొద్దిపాటి సన్నివేశాలు చిత్రీకరించాలని త్రివిక్రమ్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబు కుటుంబంతో యూరప్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. “సర్కారు వారి పాట” విజయం సాధించడంతో గత నెల యూరప్ ట్రిప్ వేసిన మహేష్.. ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ కి చేరుకోనున్నారు. అయితే జూన్ నెల చివరిలో లేకపోతే జూలై మొదటి వారం నుండి… రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం. మహేష్ తో త్రివిక్రమ్ చేయబోయే సినిమా.. ఆరు నెలలో కంప్లీట్ చేసే దిశగా సినిమా యూనిట్ పక్కా ప్లానింగ్ తో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా అయిన వెంటనే వచ్చే ఏడాది ప్రారంభం… రాజమౌళి సినిమా స్టార్ట్ చేయాలని అంతకుముందే త్రివిక్రమ్ సినిమా మొత్తం కంప్లీట్ చేసే దిశగా మహేష్ కూడా.. పక్కా ప్లానింగ్ తో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో త్వరలో షూటింగ్ జరగబోయే ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్టు 9వ తారీకు మహేష్ బర్త్ డే కానుకగా విడుదల చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.