సినిమా

Mahesh Trivikram: మహేష్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని త్రివిక్రమ్ నయా ప్లాన్ ..??

Share

Mahesh Trivikram: టాలీవుడ్ ఇండస్ట్రీలో “బాహుబలి 2”, “పోకిరి” సినిమాలు ఇండస్ట్రీ హిట్ సినిమాలుగా నిలిచాయి అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు ఒకే తేదీన విడుదల కావడం విశేషం. 2006వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ నటించిన పోకిరి ఏప్రిల్ 28వ తారీకు రిలీజ్ అయింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి 2 2017 వ సంవత్సరం లో ఏప్రిల్ 28వ తారీకు విడుదల..అయి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే తారీకు ని టార్గెట్ చేసుకుని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. మహేష్ మూవీ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. SSMB28: Mahesh Babu and Trivikram Srinivas's film to go on floors soon | Telugu Movie News - Times of India

త్రివిక్రమ్ 2020లో ఐకాన్ స్టార్ బన్నీతో అలా వైకుంఠపురం లో నే సినిమా చేయటం తెలిసిందే. అదే త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన చివరి సినిమా. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చేసింది. దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్… మహేష్ బాబుతో సినిమా స్టార్ట్ చేయడం తో.. ఈ ప్రాజెక్టుపై అంతటా ఆసక్తి నెలకొంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన “అతడు”, “ఖలేజా” ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. రెండు సినిమాలలో డిఫరెంట్ గా మహేష్ లో ఉన్న నటనా కోణాలను కొత్తగా చూపించాడు. అతడు లో సైలెంట్… కలేజా లో అదిరిపోయే టైమింగ్ కామెడీ తో మాట్లాడే మహేష్..నీ స్క్రీన్ మీద సరికొత్తగా త్రివిక్రమ్ ప్రజెంట్ చేయడం జరిగింది.Mahesh Babu: Guruji Master Plan .. That typical actor in Mahesh Trivikram movie .. | Is Vijay Sethupathi going to play a pivotal role in superstar Mahesh Babu Trivikram Srinivas movie? - filmyzoo - Hindisip

మరి ఇటువంటి తరుణంలో మూడో సినిమాలో మహేష్ ని త్రివిక్రమ్ ఈ విధంగా చూపిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుండి స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ సరికొత్త షెడ్యూల్స్ రిపేర్ చేశారట. అయితే సినిమా మాత్రం ఏప్రిల్ మాసంలో 28వ తారీకు విడుదలయ్యేలా.. సెంటిమెంట్ పరంగా ఇండస్ట్రీ హిట్ అయ్యేలా.. త్రివిక్రమ్.. ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో సరికొత్త టాక్ నడుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమా చివరి షెడ్యూల్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. సినిమా మే 12వ తారీకు రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో ఏప్రిల్ 28 వ తారీకు.. సర్కారు వారి పాట టీజర్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Share

Related posts

ప్రభాస్ లాగా మహేష్ అవలేకపోతున్నాడన్న బాధలో ఉన్న మహేష్ బాబు ఫ్యాన్స్ కి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన ‘సర్కారు వారి’ పాట టీమ్ ..!

GRK

బెల్లంకొండ‌తో హాట్ బ్యూటీ

Siva Prasad

kaniha Family Photos

Gallery Desk