Entertainment News సినిమా

“గాడ్ ఫాదర్” ఫస్ట్ సింగిల్ విషయంలో తమన్ పై ట్రోలింగ్..!!

Share

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా “గాడ్ ఫాదర్” తెరకెక్కిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 5వ తారీఖు దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు బాలీవుడ్ ఖండాల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఇటీవల ఫస్ట్ సింగిల్ ప్రోమో.. “తార్ మార్ టక్కర్ మార్” సాంగ్ రిలీజ్ చేయడం తెలిసిందే. సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.

Trolling on Taman regarding "Godfather" first single
God Father

విషయంలోకి వెళ్తే రవితేజ నటించిన “క్రాక్” సినిమాలో “డండ నకర నకర” అనే సాంగ్ కి కాపీగా ఉందని నెటిజన్ లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రెండు పాటలను పోల్చి ఏంటమ్మా తమన్..ఇది అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మెగా ఫాన్స్ అయితే మండిపడుతున్నారు. గతంలో మరికొద్ది రోజుల్లో “గాడ్ ఫాదర్” ఫస్ట్ లుక్ వీడియో విడుదల సమయాల్లో వారం రోజులు కావస్తున్నా గాని ఇప్పటికీ మ్యూజిక్ తమన్ అందించలేదని ఓ కార్యక్రమంలో చిరంజీవి వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.

Trolling on Taman regarding "Godfather" first single
God Father

దీంతో తాజాగా “క్రాక్” సినిమా ట్రాక్ తో… “గాడ్ ఫాదర్” సినిమాకి సాంగ్ ఇవ్వటం పట్ల తమన్.. చిరంజీవి సినిమా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు ఒకలాగా కుర్ర హీరోలకు మరొక లాగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే “ఆచార్య” అట్టర్ ఫ్లాప్ కావడంతో… “గాడ్ ఫాదర్” సినిమాతో చిరంజీవి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.


Share

Related posts

F2 బాలీవుడ్ రీమేక్‌

Siva Prasad

Sreemukhi: పెళ్లిపై బిగ్ స్టేట్‌మెంట్.. వామ్మో శ్రీ‌ముఖి అలా అందేంటి..?

kavya N

Chiranjeevi: చిరు కీల‌క నిర్ణ‌యం.. ఇక మెగా డాట‌ర్ సెటిల్ అయిన‌ట్టే?!

kavya N