Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలలో మరోపక్క సినిమారంగంలో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాలు పవన్ సినిమాలు రాకపోవటంతో..తాజా పవన్ రీఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ మరియు పాటలు ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకోవడంతో..సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పవన్ అభిమానులకు గుర్తుండిపోయే విధంగా నిర్మాత దిల్ రాజు దాదాపు రెండు కోట్లకు పైగా ఖర్చు చేయడానికి రెడీ అయ్యారు.
యూసఫ్ గూడా గ్రౌండ్స్ లో ఏప్రిల్ 3 వ తారీఖున ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో .. ఏ సినిమాకి చేయని విధంగా చేసే రీతిలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల శివరాత్రి పండుగ పర్వదినం క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” సినిమా అనే టైటిల్ ప్రకటించగా, వచ్చే ఉగాది పండుగకు రానా తో పవన్ కళ్యాణ్ నటిస్తున్న మల్టి స్టారర్ సినిమాకి సంబంధించిన టైటిల్ ప్రకటించబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్.
మలయాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా రానా కీలక పాత్ర చేస్తూ ఉన్నారు. దీంతో వచ్చే తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ ఉగాది పర్వదినం ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటించబోతున్నట్లు వార్త రావడంతో కచ్చితంగా ఇది పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.