Raviteja: గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ప్లాపులు లో నిండా మునిగిపోయి ఉన్న హీరో రవితేజ. కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ తర్వాత.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. “క్రాక్” సినిమాతో .. సూపర్ డూపర్ హిట్ అందుకున్న రవితేజ .. మళ్లీ హిట్ ట్రాక్ లో పడ్డాడు. ఈ సినిమా విజయంతో రవితేజ అభిమానులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.
ఒకానొక టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా.. రవితేజ తో సినిమాలు చేయటానికి అనేక మంది ప్రొడ్యూసర్లు క్యూ కట్టే వాళ్ళు. కానీ తరువాత వరుస ఫ్లాపులు రావటంతో పాటు గ్యాప్ ఎక్కువ తీసుకోవటం… మళ్లీ ఫ్లాప్ లు పలకరించడంతో రవితేజ పరిస్థితి ఇండస్ట్రీలో ముగిసినట్లే అనే టాక్ అప్పట్లో ఉండేది. కానీ “క్రాక్” సినిమాతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హ్యాట్రిక్ హిట్ అందుకునీ… ప్రస్తుతం మంచి జోరుమీద ఉన్నాడు. నెక్స్ట్ కిలాడి సినిమా రిలీజ్ చేయటానికి.. ఆలోచన చేస్తున్న రవితేజ ప్రస్తుతం ఇద్దరు టాప్ డైరెక్టర్లను లైన్ లో పెట్టినట్లు తాజాగా… కమర్షియల్ సినిమాలు తీస్తూ ఎంటర్టైనర్ అందించే.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా సినిమా ఒప్పుకున్నట్లు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ వినపడుతోంది.
ఈ వార్తకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇదేగాక మరోసారి పూరీ జగన్నాథ్ తో కూడా రవితేజ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. దీంతో .. క్రాక్ సినిమా ఇచ్చిన విజయంతో ..మాస్ మహారాజా రవితేజ మంచి స్పీడ్ మీద ఉన్నాడు అన్న వార్తలు ఫిలింనగర్ లో బలంగా వినబడుతున్నాయి. డైరెక్టర్ మారుతి మంచి ఎంటర్ టైన్ చేసే స్క్రిప్టులు అందించే ట్రాక్ రికార్డు ఉండటంతో.., రవితేజ తో మారుతి సినిమా చేస్తున్నట్లు వార్త వినబడుతూ ఉండటంతో .. రవితేజ ఫ్యాన్స్ మరో హిట్ గ్యారెంటీ అని తాజా వార్త పై సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!