Vijay Deverakonda: హీరో విజయ్ దేవరకొండ ఖుషి సినిమా విజయంతో హిట్టు ట్రాక్ ఎక్కటం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో సెప్టెంబర్ మొదటి తారీకు విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రేమ కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మరియు సమంత నటన.. అందరిని ఆకట్టుకోవడం జరిగింది. విజయ్ దేవరకొండ కెరియర్ లోనే రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 41 కోట్ల షేర్ ను 78 కోట్ల గ్రాస్ అందుకోవడం జరిగింది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 53.50 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగగా బ్రేక్ ఈవెన్ కోసం పది కోట్ల సాధించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆ సమయంలోనే జవాన్ సినిమా హిట్ అవ్వటంతో ఖుషి సినిమా కలెక్షన్స్ కి గండి పడినట్లు అయింది. ప్రస్తుతం ఓటీపీ హక్కులను దగ్గర స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకోవడం జరిగింది. ఇక ఖుషి సినిమా తర్వాత ప్రస్తుతం గీతాగోవిందం వంటి మర్చిపోలేని హిట్ తన కెరీర్లో ఇచ్చిన పరుశురాంతో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మృణాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సరవేగంగా జరుపుకుంటుంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి “ఫ్యామిలీ స్టార్” అనే టైటిల్ ఖరారు చేయడం జరిగిందట. దసరా పండుగ సందర్భంగా ఈనెల 18వ తారీకు సాయంత్రం ఆరు గంటల 30 నిమిషాలకు ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ వీడియోతో పాటు టైటిల్ రిలీజ్ చేయబోతున్నారట.
ఈ మూవీ టీజర్ పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే వచ్చే సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ సినిమాలు లైన్లో ఉన్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, నాగార్జున నా స్వామి రంగా, హనుమాన్, వెంకటేష్ సైంధవ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ పెద్ద సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కూడా రిలీజ్ చేయబోతున్నాను. ఈ సినిమా తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిననూరి దర్శకత్వంలో విజయ్ తన 12వ సినిమా చేయబోతున్నారట. ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించబోతున్నాయి. ఇక వరుస సినిమాలతో విజయ్ దేవరకొండ దూసుకుపోతున్నారు.