సినిమా

Anupama: షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌కు అనుప‌మ‌.. ఊహించ‌ని షాకిచ్చిన ఫ్యాన్స్‌!

Share

Anupama: అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేర‌ళ‌కు చెందిన ఈ అందాల భామ `అ ఆ` మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి.. `శతమానం భవతి`తో గుర్తింపు పొందింది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన అనుప‌మ‌.. స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకోలేక‌పోయినా మంచి న‌టిగా విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది.

ప్ర‌స్తుతం ఈమె నిఖిల్‌తో 18 పేజెస్‌, కార్తికేయ చిత్రాలు చేస్తోంది. అలాగే బటర్‌ ఫ్లై అనే మ‌రో మూవీలోనూ న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్ల‌గా, అక్క‌డ ఆమెకు ఫ్యాన్స్ ఊహించ‌ని షాకిచ్చార‌ట‌. అస‌లేం జ‌రిగిందంటే.. సోమ‌వారం నాడు సూర్యాపేట జిల్లా కోదాడలోని పీపీఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సం జ‌రిగింది.

Anupama Parameswaran New Gallerys

ఈ ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మానికి అనుప‌మ స్పెష‌ల్ గెస్ట్‌గా వెళ్లింది. ఈ విష‌యం తెలుసుకున్న స్థానికులు మ‌రియు అభిమానులు అనుప‌మ‌ను చూసేందుకు భారీ త‌ర‌లివ‌చ్చారు. షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సం అనంత‌రం మీడియాలో ముచ్చ‌ట్లు పెట్టిన అనుప‌మ‌.. ఆపై తిరుగుముఖం ప‌ట్టింది. అయితే ఇంత‌లోనే అక్క‌డిని వారు సెల్ఫీలు కోసం ఎగ‌బ‌ట్టారు.

కానీ, అప్ప‌టికే ఆల‌స్యం అవ్వ‌డంతో అనుప‌మ వెళ్లిపోయేందుకు సిద్ధమైంద‌ట‌. దీంతో ఆమె అక్క‌డే ఉంచేందుకు కొందరు ఆకతాయిలు ఏకంగా అనుప‌మ‌ కారు టైర్లలో గాలి తీశారట. ఈ సంఘ‌ట‌న‌తో అనుప‌మ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌గా.. వెంట‌నే స‌ద‌రు షాంపిగ్ మాల్ య‌జ‌మానులు వేరే కారును ఏర్పాటు చేసి ఆమెను ఇంటికి పంపించార‌ట‌.


Share

Related posts

108 ప్రీ-రిలీజ్‌కు వారు

Siva Prasad

Kalyan ram: నందమూరి హీరో చేస్తున్న పెద్ద ప్రయోగం ఫలిస్తుందా..!

GRK

Monal – Akhil : ఇన్ స్టా లో ఒక హాట్ హాట్ స్టోరీ పెట్టిన మొనల్ – మామూలు హాట్ కాదు రా బాబోయ్

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar