Samantha Anushka: వరుస పరాజయాలతో ఉన్న సమంత ఇటీవల “ఖుషి” సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ మొదటి తారీకు విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. ప్రేమ కథ నేపథ్యంలో దొరికిన ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండతో సమంత నటించిన రొమాన్స్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో పాటు ఫస్ట్ ఆఫ్ ఇంకా క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాని విజయపతంలో నడిపించాయి. వరుసపరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండకి కూడా “ఖుషి”. సినిమా మంచి బ్రేక్ ఇవ్వటం జరిగింది.
దీంతో విజయ్ దేవరకొండ కెరియర్ లోనే రికార్డు స్థాయి వసూలు వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో బ్రేక్ ఇవేన్ దాటేసి.. భారీ లాభాల్లోకి దూసుకుపోతూ ఉంది. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి మాత్రం కాస్త విభిన్నంగా ఉంది. సరిగ్గా “ఖుషి” హిట్ అయిన తర్వాత వారమే.. అనుష్క నటించిన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” విడుదల కావడం జరిగింది. వరస పరాజయాలలో ఉన్న అనుష్క సైతం ఈ సినిమాతో విజయం అందుకుంది. ఐదారు సంవత్సరాల తర్వాత అనుష్క సినిమా విజయం సాధించటంతో ఫ్యామిలీ ప్రేక్షకులు అనుష్క అభిమానులు.. ఇప్పుడు ఎక్కువగా ఈ సినిమాపై మొగ్గుచూపుతున్నారు.
ఇక ఇదే సమయంలో షారుక్ నటించిన “జవాన్” సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో.. “ఖుషి” సినిమాకి కలెక్షన్స్ ఒకసారిగా తగ్గిపోయాయి అంట. ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ సాధించిన రెండు తెలుగు రాష్ట్రాలలో.. ఈ సినిమాకి ఇంకా దాదాపు 12 నుంచి 15 కోట్లు వసూలు రాబట్టాల్సి ఉందట. ఇంతలోనే అనుష్క సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. సమంత “ఖుషి” దాదాపు 15 కోట్లు.. నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో “ఖుషి” సినిమా విజయం సాధించిందని ఫుల్ ఎంజాయ్ చేస్తున్న సమంతకి అనుష్క ఊహించని షాక్ ఇచ్చినట్లు అయిందని సినీ ప్రేమికులు అంటున్నారు. అనుష్క కొద్దిగా తన సినిమా రెండు మూడు వారాలు తర్వాత విడుదల చేసి ఉంటే సమంత.. “ఖుషి” విజయం పట్ల పరిపూర్ణమైన ఆనందం దక్కుండేదని చెప్పుకొస్తున్నారు. అనుష్క తన కొత్త సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” త్వరగా విడుదల చేయడం వల్ల “ఖుషి” కలెక్షన్లకు గండి పడినట్లు అయిందని కామెంట్లు చేస్తున్నారు.