Game Changer: నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున ఫ్యాన్స్ వేడుకలు చేశారు. ఇదే సమయంలో శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా టైటిల్.. “గేమ్ చెంజార్” అని ప్రకటించడంతోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదే సమయంలో చాలామంది సినిమా హీరోలు.. సెలబ్రిటీలు.. చరణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం చరణ్ కి ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
దీంతో షాకు చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల “నాటు నాటు” సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చిన సమయంలో కూడా చరణ్ ని అమిత్ షా ప్రత్యేకంగా సత్కరించారు. ఇప్పుడు చరణ్ జన్మదినం నేపథ్యంలో… ఫోన్ చేసి విషెస్ తెలియజేయడం సంచలనంగా మారింది. చాలాకాలం తర్వాత చరణ్ బర్త్ డే వేడుకలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. శంకర్ సినిమాతో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న సినిమా ప్రాజెక్టు నుండి కూడా చరణ్ జన్మదిన శుభాకాంక్షలు అందుకున్నాడు. ప్రస్తుతం చరణ్ భార్య ఉపాసన గర్భవతి.. మరోపక్క “RRR”కీ ఆస్కార్ అవార్డు రావడం అన్ని కలిసొస్తూ ఉండటంతో… చరణ్ ఆనందానికి అవధులు లేవు.
చరణ్ బర్తడే కానుకగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా టైటిల్ ప్రకటనతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో… భారీ యాక్షన్ సన్నివేశాలు… విజువల్ వండర్ ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో కొన్ని వందలాది మందితో చరణ్ ఒక సాంగులో వేసే స్టెప్ లు.. చాలా హైలైట్ గా ఉండబోతుందని డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలియజేశారు. మొత్తం మీద శంకర్ “గేమ్ చేంజర్” మెగా ఫాన్స్ కి ఫుల్ మీల్స్ లాంటి మూవీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.