పోలీస్ అంటే రక్షణ. ఆపదలో ఉన్న వారికి అభయ హస్తం అందించి రక్షణ అందించే పోలీసులు కర్కశంగా ఉన్మాదిగా ఎందుకు మారాడు? అసలు అలా మారడానికి దారి తీసిన పరిస్థితులేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే `ఉన్మాది` సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు ఎన్.ఆర్.రెడ్డి. ప్రవీణ క్రియేషన్స్ ప్రై.లి. పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ఎన్.కరణ్ రెడ్డి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘ఉన్మాదిస. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత ఎన్.ఆర్.రెడ్డి మాట్లాడుతూ – ”ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ. సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుంది. డేవిడ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు, ట్రైలర్ను ఇటీవల విడుదల చేశాం. చాలా మంచి స్పందన వచ్చింది. అన్నీ కార్యక్రమాలను పూర్తిచేసి సినిమాను ఫిబ్రవరి 8న విడుదల చేయబోతున్నాం“ అన్నారు. టైటిల్ పాత్రలో ఎన్.ఆర్.రెడ్డి నటిస్తూ దర్శకత్వం వహించారు
previous post
next post