Unstoppable 2: ఆహా “అన్ స్టాపబుల్ 2” షో ఈనెల 14వ తారీకు స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. మొదటి సీజన్ లో ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలు దర్శకులు రాగా రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ చంద్రబాబుతో పాటు నారా లోకేష్ హాజరయ్యారు. పొలిటికల్ గా చంద్రబాబు ఎపిసోడ్ తెలుగు రాజకీయాలలో సెన్సేషనల్ అయ్యింది. వ్యక్తిగతంగా ఇంక రాజకీయంగా అదే విధంగా కుటుంబ పరంగా ప్రశ్నలు వేయడం జరిగింది. హోస్ట్ బాలకృష్ణ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు, నారా లోకేష్ ఇచ్చిన జవాబులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక సంచలనాలకు పలు విమర్శలకు దారి తీసాయి.
ఇదే సమయంలో షో మధ్యలో జాయిన్ అయిన నారా లోకేష్ నీ అనేక ప్రశ్నలు వేయడం జరిగింది. బయట ఎప్పుడూ చాలా సీరియస్ గా ఉండే చంద్రబాబు ఈ షోలో చాలా నవ్వుతూ కనిపించారు. టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గురించి.. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డితో స్నేహం గురించి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా స్టూడెంట్ లైఫ్ ఇంకా రాజకీయాలలో తొలి నాళ్ళల్లో తలెత్తిన పరిస్థితుల గురించి అనేక విషయాలు తెలియజేశారు.
ఈ క్రమంలో అన్ స్టాపబుల్ రెండో సీజన్ బాలకృష్ణ చంద్రబాబు ఎపిసోడ్ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. 24 గంటల్లోనే చంద్రబాబు బాలకృష్ణ ఎపిసోడ్ కి 10 లక్షల వ్యూస్ వచ్చినట్లు ఆహా టీం తెలిపింది. OTTలో ఇది సంచలన రికార్డు అని ఆహా తెలిపింది. దేశంలో అన్ని టాకీ షోలలో ఆన్ స్టాపబుల్ మొదటి సీజన్ అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. సెకండ్ సీజన్ కూడా ఆ దిశగానే అరకాటులకు క్రియేట్ చేస్తూ ఉండటంతో ఆహా టీం చాలా సంతోషంగా ఉంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!