రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టీవీ ప్రేక్షకులకు ‘జబర్దస్త్’ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్పీ రేటింగ్ లలో తనదైన రికార్డులను సృష్టించిన ఈ షో ఇప్పటికీ ‘ఈ టీవీ’ లో ఎన్నో సంవత్సరాల నుండి చాలా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. మల్లెమాల ప్రొడక్షన్స్ వారు మొదలెట్టిన ఈ షో ఇండస్ట్రీకి ఎంతో మంది మంచి కమెడియన్ లను ఇచ్చింది. తమ అందాలతో ఉర్రూతలూగించే యాంకర్లు, ప్రముఖ జడ్జీలు, ఇక కడుపుబ్బా నవ్వించే ఆర్టిస్టులతో జబర్దస్త్ సాఫీగా సాగిపోతుంది.
అయితే ఈ షో లో కాంట్రవర్సీలకు కూడా కొదవ లేదు. టీం సభ్యులు లీడర్లను వెన్నుపోటు పొడవడం వంటివి కామెడీగా స్కిట్ళ రూపంలో చెప్పినా కూడా వారికి లోపల బాధ ఉంటుంది. అంతే కాకుండా ఎంతోమంది విభేదాలతో ఆ షో నుండి వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు. ఇక ఏకంగా మెగా బ్రదర్ నాగబాబు అయితే గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు జబర్దస్త్ లో మధ్యనే రీ-ఎంట్రీ ఇచ్చిన షకలక శంకర్ వెంటనే వెళ్ళిపోతున్నాడు అన్న వార్తలు గుప్పుమన్నాయి.
శంకర్ కి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్. సినిమాల్లో బోలెడు అవకాశాలు రావడంతో తర్వాత దానిని వదిలేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు శంకర్ కు సినిమా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ స్కిట్లు చేసుకుంటున్నాడు. ఇకపోతే జబర్దస్త్ లో నాగబాబు తప్పుకున్న తర్వాత శంకర్ రీ ఎంట్రీ ఇచ్చాడు అని కొందరు అంటున్నారు. అయితే మళ్ళీ ఈ షోకి అతను గుడ్ బై చెప్తున్నాడు అని వార్తలు రావడమ్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
అంతే కాకుండా అతను చేస్తున్న స్కిట్ లు గతంలోలాగా యూట్యూబ్ సరైన రెస్పాన్స్ లేకపోవడం…. అనుకున్నంత రేంజ్ లో రెమ్యునరేషన్ రాకపోవడంతో ఇక్కడ కొనసాగి లాభం లేదని ఫీల్ అవుతున్నాడట ఈ శ్రీకాకుళం కమెడీయన్. చిన్న సినిమాలైనా… ఇండస్ట్రీలోనే అవకాశాల కోసం ప్రయత్నించేందుకు నిర్ణయించుకున్నాడని చెబుతున్నారు. ఇప్పటికే శంకర్ ఒక రెండు చిన్న సినిమాలకు కూడా సైన్ చేసినట్లు భోగట్టా.