NewsOrbit
Entertainment News సినిమా

Unstoppable 3: “అన్ స్టాపబుల్” సీజన్ 3 మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ తేది మరియు గెస్ట్ లు ఎవరో తెలియజేసిన ఆహా..!!

Share

Unstoppable 3: అన్ స్టాపబుల్ టాకీ షో దేశంలోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ షోలో బాలకృష్ణ హోస్ట్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చేలా వ్యవహరించడం జరిగింది. ఈ షో కి ముందు కేవలం సినిమా నటుడిగా రాజకీయ నేతగా మాత్రమే గుర్తింపు కలిగిన బాలయ్య..”అన్ స్టాపబుల్” లో అదిరిపోయే యాంకరింగ్ తో పాటు అందరినీ ఆకట్టుకునే విధంగా.. షోనీ సక్సెస్ చేయడం జరిగింది. మొదటి సీజన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు రాగా రెండవ సీజన్ లో రాజకీయ నాయకులు రావడం జరిగింది.

Unstoppable Season three First Episode And Who Are The Guests Aha

ఎవరినైనా బాలయ్య బాబు చాలా చక్కగా డీల్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ వచ్చే విధంగా రెండు సీజన్స్.. అద్భుతంగా నడిపించారు. అయితే ఇప్పుడు మూడో సీజన్ కి ఆహా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా అక్టోబర్ 17వ తారీకు నుండి మూడో సీజన్ స్టార్ట్ కాబోతున్నట్లు ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ఎపిసోడ్ లో “భగవంత్ కేసరి” సినిమా యూనిట్ రాబోతోంది. ఆల్రెడీ ఎపిసోడ్ షూటింగ్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తేరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 20వ తారీకు విడుదల కానుంది.

Unstoppable Season three First Episode And Who Are The Guests Aha

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దసరా పండుగ నేపథ్యంలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురుగా శ్రీ లీల నటిస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్. బాలకృష్ణ తెలంగాణ యాసలో ఈ సినిమాలో డైలాగులు చెప్పడం జరిగింది. ఈ సినిమాలో బాలయ్య బాబు 60 ఏళ్ల పాత్రలో కనిపిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తరహాలో అనిల్ రావిపూడి మార్క్ కామెడీ సినిమాలో ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. “భగవంత్ కేసరి” లో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటించడం జరిగింది.


Share

Related posts

అడవి శేష్ ఇన్నాళ్ళు చేసిన సినిమాలన్ని ఒకటైతే మేజర్ ఒక్కటే ఒకటని మహేష్ బాబు ఎలా ఫిక్సైయ్యాడు ..?

GRK

Pushpa 2: `పుష్ప 1`కి నో చెప్పిన ఆ స్టార్‌ హీరో పార్ట్-2కు ఓకే చెప్పాడా..?

kavya N

Paluke Bangaramayenaa December 04 2023 Episode 90: అభిషేక్ స్వరల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందా లేదా?..

siddhu