NewsOrbit
Entertainment News సినిమా

Unstoppable 3: “అన్ స్టాపబుల్” సీజన్ 3 ప్రోమో రిలీజ్ సందడి చేసిన “భగవంత్ కేసరి” టీం..!!

Share

Unstoppable 3: అన్ స్టాపబుల్ సీజన్ 3 షురూ అయింది. అక్టోబర్ 17వ తారీఖు నాడు ఆహా ఓటీడీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆల్రెడీ మొదటి రెండు సీజన్స్ దేశంలోనే రికార్డు స్థాయి వ్యూస్ రాబట్టాయి. హోస్ట్ గా బాలకృష్ణ తనలో మరో కోణాన్ని చూపించి అభిమానులను మాత్రమే కాదు సామాన్యులను సైతం అలరించారు. షో కి వచ్చే సినిమా సెలబ్రిటీలను రాజకీయ నాయకులను తనదైన శైలిలో ప్రశ్నలు వేసి వారితో ఎంటర్టైన్మెంట్ చేయిస్తూనే మరోపక్క కాంట్రవర్సీ ప్రశ్నలకు జవాబులు కూడా రాబట్టేవాళ్ళు.

Unstoppable with NBK Season 3 on OTT: Bhagavanth Kesari star Nandamuri Balakrishna returns as a talk show host

మొదటి సీజన్ లో సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు వస్తే రెండో సీజన్ లో సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు రావడం జరిగింది. అయితే ఇప్పుడు మూడో సీజన్ అక్టోబర్ 17వ తారీఖు నుండి ప్రసారం కాబోతోంది. అన్ స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ “భగవంత్ కేసరి” సినిమా యూనిట్ రావడం జరిగింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి తో పాటు హీరోయిన్లు కాజల్ అగర్వాల్ అదేవిధంగా శ్రీలీలా వచ్చారు. విలన్ పాత్రలో వచ్చిన అర్జున్ రాంపాల్ కూడా సందడి చేయడం జరిగింది.

Unstoppable Season 3 : అన్​స్టాపబుల్​లో 'భగవంత్ కేసరి' మూవీటీమ్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్​గా శ్రీలీల, కాజల్, unstoppable-season-3-the-bhagavanth- kesari-movie-team-shines-at-season-3 ...

ఈ సందర్భంగా మొదటి ఎపిసోడ్ ప్రోమో లో బాలకృష్ణ యధావిధిగా మంచి జోష్ మీద కనిపించారు. ఆఫ్ స్క్రీన్ లో మీ జోష్ చూశాక .. మీతో ఒక ఫుల్ లెన్త్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తానని అనిల్ రావిపూడి ఈ షోలో చెప్పటం హైలెట్. ఇదే సమయంలో నందమూరి కుటుంబంలో రెండు తరాల హీరోలతో నటించావు.. నా కొడుకు మోక్షాజ్ఞతో కూడా నటిస్తావా అని బాలకృష్ణ వేసిన ప్రశ్నకు కాజల్ అగర్వాల్ తప్పకుండా అని సమాధానం.. ఇవ్వడం విశేషం. “భగవంత్ కేసరి” దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తారీకు విడుదల కాబోతోంది. ఈ సినిమాలో బాలయ్య బాబు 60 ఏళ్ల వయసు పాత్రలో కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ మరియు పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేయడం జరిగింది.


Share

Related posts

Mahesh NTR: కరోనా విషయంలో ముందు జాగ్రత్త పడ్డా మహేష్, ఎన్టీఆర్..??

sekhar

మాజీ ప్రేమికుడితో

Siva Prasad

Vakeel Saab : అలా అయితే “వకీల్ సాబ్” రిలీజ్ చేయొద్దు అంటున్న పవన్ ఫ్యాన్స్..!!

sekhar