31.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Unstoppable 2: పవన్… బాలకృష్ణ “అన్ స్టాపబుల్” షోకి సంబంధించి స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ఆహా..!!

Share

Unstoppable 2: ఆహా ఓటిటిలో “అన్ స్టాపబుల్” రియాల్టీ షో చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించటం అందరిని ఆకట్టుకుంది. గత ఏడాది మొదటి సీజన్ ఎంతగా పాపులర్ అయిందో రెండో సీజన్ దానికి మించి పాపులారిటీ సంపాదించింది. మొదటి సీజన్ లో అందరూ సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలే వచ్చారు. కానీ రెండో సీజన్ వచ్చేసరికి సినిమా సెలబ్రిటీలతో పాటుగా రాజకీయ నాయకులు రావటం విశేషం. భారతదేశంలోనే నెంబర్ వన్ టాకీ షోగా “అన్ స్టాపబుల్” అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.

Unstoppable show pawan and balakrishna episode behind camera scenes video

మొదటి సీజన్ లో మహేష్ బాబు ఎపిసోడ్ రికార్డ్ స్థాయి వ్యూస్ రాబట్టింది. రెండో సీజన్ లో ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లు అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. రెండో సీజన్ ఫైనల్ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ దే అన్ని ఎపిసోడ్ల కంటే హైలైట్ గా నిలిచింది. ఆహా “అన్ స్టాపబుల్” టాకీ షోలో అన్ని రికార్డులు బ్రేక్ చేసేసింది. రెండు భాగాలుగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రసారం కావడం తెలిసిందే. మొదటి ఎపిసోడ్ లో తన వ్యక్తిగత జీవితంతో పాటు సినిమా కెరియర్ గురించి ఇంకా కుటుంబం గురించి పలు విషయాలు తెలియజేశారు. చిన్ననాటి సమయంలో ఎదుర్కొన్న అనారోగ్యాలు ఇంకా చదువు గురించి ఎవరికీ ఎప్పుడు తెలియని విషయాలు పవన్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తనకున్న స్నేహాన్ని గురించి.. పవన్ చెప్పిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది.

Unstoppable show pawan and balakrishna episode behind camera scenes video

మొదటి ఎపిసోడ్ మధ్యలో మరో మెగా హీరో సాయి ధరమ్ పాల్గొనడం తెలిసిందే. చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ తో చిన్ననాటి నుండి తనకున్న బాండింగ్ గురించి అనేక విషయాలు తెలియజేశారు. ఇక రెండో భాగం వచ్చేసరికి డైరెక్టర్ క్రిష్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. బాలకృష్ణ…పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఓకే ఫ్రేమ్ లో చాలా సేపు కనిపించడం… సంచలనం సృష్టించింది. అయితే ఈ ఎపిసోడ్ కి సంబంధించి..షూట్ లో తెర వెనక ఏం జరిగిందో మేకింగ్ వీడియో ని ఆహా రిలీజ్ చేయడం జరిగింది. “బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ పార్ట్ 1&2 బిహైండ్ దా సీన్స్. మీరు చూడాల్సింది ఇంకా ఉంది అంటూ సోషల్ మీడియాలో ఈ స్పెషల్ వీడియో ఆహా టీం రిలీజ్ చేసింది.

 


Share

Related posts

`ఎవ‌రికీ చెప్పొద్దు` …శ‌ర్వానంద్‌

Siva Prasad

గజినీ మూవీలో హీరో ఆఫర్ వదులుకున్న ఆ స్టార్ యాక్టర్.. ఎందుకంటే!

Ram

Top Indian Crush: ఇండియాలో అదరగొట్టే క్రష్ భామలు వీళ్ళే..!!

bharani jella