సినిమా

Acharya-Upasana: `ఆచార్య‌`పై ఉపాస‌న రియాక్ష‌న్ వైర‌ల్‌.. అలా అందేంటి..?

Share

Acharya-Upasana: మెగా మల్టీస్టార్ `ఆచార్య` అనేక వాయిదాల అనంత‌రం నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస హిట్స్‌తో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్‌గా గుర్తింపు సంపాదించుకున్న డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేయ‌గా.. సోనూ సూద్, జిషు సేన్‌గుప్తా, తనికెళ్ల భరణి కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

కొర‌టాల ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన చిత్రాల‌న్నీ విజ‌యం సాధించ‌డం, చిరు-చ‌ర‌ణ్‌లు క‌లిసి పూర్తి స్థాయి పాత్ర‌ల్లో న‌టించ‌డం వంటి అంశాలు ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొనేలా చేశారు. కానీ, ఏం లాభాం.. అట్టహాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఆచార్య అంచ‌నాల‌ను ఏ మాత్రం అందుకోలేక‌పోయింది.

Acharya CM Jagan: Jagan Master Mind behind This..!?

తొలి షో నుంచే ఈ సినిమాపై నెగ‌టివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్లు ఉన్నా.. వారికి త‌గ్గా క‌థైతే ఏమీ లేదు. క‌థ‌నం రోటీన్‌గా సాగుతుంది. చిరంజీవి క్యారెక్టరైజేషన్ చాలా డ‌ల్‌గా ఉంటుంది. దర్శకత్వంలో, సంభాషణల్లో కొరటాల మార్క్ కూడా కనిపించలేదు. అయితే ఈ సినిమాపై మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి రియాక్ష‌న్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

సాధార‌ణంగా సినిమాల‌పై పెద్ద‌గా ఆస‌క్తి చూప‌ని ఉపాస‌న‌.. చ‌ర‌ణ్ సినిమాల‌ను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తుంటారు. ఈ నేప‌థ్యంలోనే నిన్న ఆమె ఏఎంబీ మాల్‌లో ఉపాసన ఈ సినిమాను వీక్షించారు. ఈ చిత్రాన్ని అభిమానులు, ప్రేక్ష‌కుల‌ మధ్యలో కూర్చుని వీక్షించింది. అపై `లవ్ లవ్ లవ్ ది మూవీ` అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె పోస్ట్‌పై నెటిజ‌న్లు ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు. ప్లాప్ టాక్ సొంతం చేసుకున్న ఆచార్య‌ను ఉపాస‌న బాగుంద‌ని చెప్ప‌డ‌మేంటి అంటూ విమ‌ర్శలు కురిపిస్తున్నారు.

 


Share

Related posts

టాలీవుడ్‌కి మ‌రో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌

Siva Prasad

Salaar : సలార్ తో ప్రశాంత్ నీల్ ఇంత షాకిస్తాడని అనుకోలేదు..డార్లింగ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు..!

GRK

దీపాలు వెలిగించిన హీరో నిఖిల్.. ఎందుకో తెలుసా..?

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar