సినిమా

Rajamouli: ఇది విన్నారా? రాజమౌళి సమర్పణలో వస్తోన్న బాలీవుడ్ బడా మూవీ!

Share

rajamouli: ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే చిన్న చూపు చూసిన బాలీవుడ్ ఇప్పడు మన సినిమాల కోసం ఎగబాకుతుందంటే అతిశయోక్తి కాదు. ఇక ఇంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మాత్రం దర్శక ధీరుడు రాజమౌళి మాత్రమే. అవును.. ఇండియన్ సినిమా అంటే మిగతా దేశాల వాళ్ళు బాహుబలి ముందు తరువాత అనే మాట్లాడుకొనే పరిస్థితి. రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ మూవీ తరువాతే తెలుగు సినిమా స్థాయి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. టాలీవుడ్ తో పాటు దక్షిణాదిలో పాన్ ఇండియా చిత్రాల నిర్మాణానికి మేకర్స్ ధైర్యంగా ముందుకొస్తున్నారంటే అది అంతా రాజమౌళి పుణ్యమే.

Upcoming Bollywood Bada Movie Presented by Rajamouli!
Upcoming Bollywood Bada Movie Presented by Rajamouli!

Rajamouli: రాజమౌళి సమర్పణలో బాలీవుడ్ మూవీ?

ప్రస్తుతం ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె`ని పాన్ ఇండియా స్థాయిలో నాగ్ అశ్విన్ చేస్తున్నాడు అంటే, అందుకు ప్రధాన కారణం రాజమౌళినే. అదే కాదు ఇపుడు ఇతర ఇండస్ట్రీలవారు కూడా ఈ స్థాయిలో సినిమాలు మన జక్కన్న స్ఫూర్తితోనే చేస్తున్నారు. రాజమౌళి వేసిన బాటలో KGF, పుష్ప తో పాటు ఇప్పుడు KGF 2 కూడా పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టిస్తుండటం విశేషం. ఈ క్రమంలో `బాహుబలి నుంచి రాజమౌళిని కీర్తించని బాలీవుడ్ సెలబ్రిటీ లేరు అంటే నమ్మశక్యం కాదు. కరణ్ జోహార్ నుంచి అజయ్ దేవగన్ అమీర్ ఖాన్ వరకు ఈ విషయమై రాజమౌళిని కీర్తిస్తున్నారు.

Upcoming Bollywood Bada Movie Presented by Rajamouli!
Upcoming Bollywood Bada Movie Presented by Rajamouli!

ఇదే ఆ సినిమా!

ఇక తాజాగా RRR సాధిస్తున్న రికార్డు స్థాయి వసూళ్లని గమనిస్తున్న బి టౌన్ లో గుబులు పుడుతోంది. కోవిడ్ కారణంగా కుదేలైన భారతీయ సినిమాకు మరీ ముఖ్యంగా థియేటర్లకు RRR చిత్రం ఊపిరి పోసింది. ఈ చిత్రంతో రాజమౌళి అందించిన ఉత్సాహంతో మిగిలిన పరిశ్రమల వారు కూడా ఇక రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ పై ఓ భారీ చిత్రం విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. తెలివైన కరణ్ బ్రహ్మాస్త్ర చిత్రాన్ని సౌత్ ఇండియాలో ఎస్. ఎస్. రాజమౌళి బ్రాండుని వాడుకోవాలని చూస్తున్నాడు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది.


Share

Related posts

PSPK 27 : 17 వ దశాబ్దం లో పవన్ కల్యాణ్ – క్రిష్ సినిమా .. హై వోల్టేజ్ యాక్షన్ సీన్ లు తీస్తున్నారు

bharani jella

ఆయ‌న పాత్ర చేయాల‌నుంది….

Siva Prasad

మ‌హేష్‌కి చిక్కేనా?

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar