Balakrishna: టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో “అఖండ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. పైగా గతంలో బాలయ్య బాబుకు సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ విజయలు అందించడంతో… ప్రస్తుతం వస్తున్న సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోపక్క డైరెక్టర్ బోయపాటి కూడా “అఖండ” సినిమాకి సంబంధించి ప్రతి సన్నివేశం స్క్రీన్ మీద అద్భుతంగా ఉండాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని వరుస విజయాల మీద ఉన్నారు. వరస ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి “క్రాక్” సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. దీంతో బాలయ్య సినిమాకి ఎటువంటి స్క్రిప్ట్ అందిస్తాడు అన్న తరహాలో అభిమానులలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ బాలయ్య తో నటించడానికి రెడీ అవుతున్నట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీ వర్గాల లో వినపడుతోంది.
ఒకరు మీనా అయితే మరొకరు శృతి హాసన్ అనే టాక్ వస్తోంది. ఇప్పటికే ఇద్దరికీ వారి క్యారెక్టర్లు చెప్పినట్లు అంతా ఓకే అయినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. బాలయ్య బాబు ని చాలా డిఫరెంట్ యాంగిల్ లో ఈ సినిమాలో గోపీచంద్ మలినేని చూపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. వరుసగా రెండు భారీ డైరెక్టర్లతో బాలయ్య బాబు సినిమాలు చేస్తూ ఉండటంతో..బాలయ్య రాబోయే సినిమాలు బాక్స్ ఆఫీసు దగ్గర మ్యాజిక్ సృష్టించడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.