శుక్రవారం వచ్చిందంటే చాలా.. ఏ సినిమాలు విడుదల అవుతున్నాయి? ఏ థియేటర్ లో వస్తున్నాయి అని జనాలు ఎదురుచూసేవారు.. కానీ ట్రెండ్ మారింది. థియేటర్లకు వెళ్లే వారు తగ్గిపోయారు.. ఇప్పుడంతా జనాలు ఓటీటీకే జై కొడుతున్నారు.. ఈవారం ఏ ఓటీటీలో ఏ మూవీ రిలీజ్ అవుతుంది.. ఏ వెబ్ సిరీస్ విడుదల అవుతుందని వెతుకుతున్నారు. థియేటర్ కి ఫ్యామిలీలో వెళ్లాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే ఓటీటీలో అయితే తక్కువ ఖర్చుతో ఎన్నిసార్లు అయినా సినిమాను చూడొచ్చు.. మరి ఈ వారం ఓటీటీలో ఏ సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయో తెలుసుకుందాం..
ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు/సిరీస్ లు ఇవే:
కట్ పుత్లి:
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘కట్ పుత్లి’ సినిమా సెప్టెంబర్ 2న డిస్నీ+హాట్ స్టార్ లో ప్రీమియర్ లో విడుదల కానుంది. ఇది తెలుగులో హిట్ అయిన ‘రాక్షసుడు’ సినిమాకు రీమేక్.. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. రంజిత్ తివారీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఢిల్లీ క్రైమ్ సీజన్ 2:
ఢిల్లీ క్రైమ్ స్టోరీ ఆధారంగా రూపొందించిన ఢిల్లీ క్రైమ్ సీజన్ 2 ఆగస్టు 26న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. షెఫాలీషా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సరీస్ ఢిల్లీ క్రైమ్. తొలి సీజన్ కి దేశవ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. ఓటీటీ ప్లాట్ పామ్ లో అత్యంత పాపులర్ వెబ్ సిరీస్ గా పేరు తెచ్చుకుంది. ఢిల్లీలో జరిగిన ఓ సంచలన క్రైమ్ చుట్టూ ఈ వెబ్ సిరీస్ కథ తిరుగుతుంది. ఢిల్లీ క్రైమ్ కి రెండో భాగమే ఢిల్లీ క్రైమ్ సీజన్ 2..
టాప్ గన్ మార్వెరిక్:
టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ టాప్ గన్ మార్వెరిక్.. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమా ఆగస్టు 24న అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంటుంది.
మహారాణి సీజన్ 2:
మహారాణి తొలి సీజన్ మంచి విజయం సాధించింది. హుమా కురేషి ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ సిరీస్ బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మహారాణి సీజన్ 2 ఆగస్టు 25 నుంచి సోని లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
మరికొన్ని చిత్రాలు:
షిహల్క్ రెండో ఎపిసోడ్ ఆగస్టు 25న హాట్ స్టార్ లో.. ‘సమరిటన్’ సినిమా ఆగస్టు 26 నుంచి అమెజాన్ ప్రైమ్ లో.. ‘మేడ్ ఇన్ చెల్సియా – మాలోర్కా’ వెబ్ సిరీస్ ఆగస్టు 23 నుంచి హేయూ ఓటీటీలో అందుబాటులో ఉంటాయి.
థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే:
లైగర్:
ఇక ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే భారీ సినిమా ‘లైగర్’. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాల భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఆగస్టు 26న వచ్చే సినిమాలు:
ఆగస్టు 26న మరికొన్ని చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. ‘భళా చోర భళా’, కళాపురం, పీకే వంటి చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?