Ram Gopal Varma: సంచలన దర్శకుడుగా సౌత్ సినిమా ఇండస్త్రీలతో పాటు బాలీవుడ్‌లోనూ అసాధారణమైన క్రేజ్ సంపాదించుకున్నారు రామ్ గోపాల్ వర్మ. మొదటి సినిమా శివ తోనే కొత్త తరహా మేకింగ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. శివ సినిమాకు ముందు కట్ టు కట్ షాట్ ఫార్మాట్ లేదనే చెప్పాలి. హాలీవుడ్ సినిమాలకు ఈ తరహా మేకింగ్ విధానం ఉండేది. అయితే, రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా మారుతూ కింగ్ నాగార్జునతో తీసిన మొదటి సినిమా శివతో అది తర్వాత తరానికి పరిచయం చేశారు.
ఇలా రామ్ గోపాల్ వర్మ మొదటి సినిమా నుంచి సంచలన నిర్ణయాలు తీసుకోవడం సంచలనాత్మకమైన సినిమాలు రూపొందించడంతో పూర్తిగా సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకున్నారు. ఆయన కెరీర్లో ఇప్పటి వరకు రీమేక్ సినిమాలను తీసింది లేదు. ఏ సినిమా తీసిన వాస్తవ సంఘటనల ఆధారంగానే సినిమాలను తీసి సంచలనం సృష్ఠిస్తున్నారు. అడల్ట్ కామెడీ అండ్ రొమాంటి చిత్రాలను తనదైన శైలిలో తీస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నారు.
Ram Gopal Varma: ఇందులో ఎంతవరకు నిజముందో ముందు ముందు తెలుస్తుంది.
ఇక ఆయన గత చిత్రం కొండా మురళి జీవిత కథ ఆధారంగా రూపొందించారు. ఇప్పుడు కన్నడ స్టార్ హీరో ఉపేంద్రతో ఓ సినిమాను చేస్తున్నట్టు తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాకు ఆర్ అనే టైటిల్‌ను పెట్టినట్టుగా కూడా తెలిపారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంని కూడా వణికించిన ఈ ఆర్ అనే పాత్రనే సినిమాలో ముఖ్య పాత్ర అని కూడా తెలిపారు. ఇంతకీ ఆ ఆర్ ఎవరనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే. అయితే చాలా మంది ఇది రామ్ గోపాల్ వర్మ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మరి ఇందు లో ఎంతవరకు నిజముందో ముందు ముందు తెలుస్తుంది.
R played by @nimmaupendra was a daredevil gangster who was not scared of anyone in the world and the most successful of all the gangsters in india pic.twitter.com/6VMtDTHIls
— Ram Gopal Varma (@RGVzoomin) March 24, 2022
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!