Uppena : టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా పేరొందిన బుచ్చిబాబు మొదటి సినిమా “ఉప్పెన” ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మొదటి సినిమా విజయంతో డైరెక్టర్ బుచ్చిబాబు పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. పైగా మెగా హీరో సాయిధరమ్ తేజ తమ్ముడు వైష్ణవ తేజ్ కి ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ కావటం తో బుచ్చిబాబు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచాడు. ఇదే తరుణంలో “ఉప్పెన” సినిమాని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బుచ్చిబాబు తో మరిన్ని సినిమాలు చేయడానికి రెడీ అయ్యే తరహాలో ఆలోచనలు చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఉప్పెన భారీ లాభాలు తీసుకురావటం మాత్రమే కాక బుచ్చిబాబు కి అనేక అవకాశాలు కల్పిస్తోంది. మేటర్ లోకి వెళితే తాజాగా మరో బంపర్ ఆఫర్ అందుకున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు. విషయంలోకి వెళితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి బుచ్చిబాబు రెడీ అయినట్లు ఇండస్ట్రీలో సరికొత్త టాక్ వినపడుతోంది. ఇటీవల ఒక స్టోరీ వినిపించినట్లు అంతా ఓకే అయినట్లు.. ఫైనల్ గా కూర్చుని ఎన్టీఆర్ కి కూడా రీసెంట్ గా.. ఈ స్టొరీ ని లాక్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల లో సరికొత్త టాక్ వినపడుతోంది.
త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో “RRR” చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయనున్నారు. త్రివిక్రమ్ ప్రాజెక్టు తర్వాత బుచ్చిబాబు సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.