Pushpa: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న “పుష్ప” పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ “రంగస్థలం” సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టడం మరోపక్క బన్నీ “అలా వైకుంఠపురం లో” సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఇద్దరూ మంచి ఫామ్ లో ఉండటంతో పాటు “పుష్ప” పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతు ఉండటంతో .. ఈ సినిమా విడుదల కోసం ఆడియన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు.
అయితే ప్రస్తుతం కరోనా తీసుకొచ్చిన కష్టాలు కారణంగా సినిమా కి పెట్టిన బడ్జెట్ ఎక్కువ అవ్వటం మరోపక్క బయట పరిస్థితి బట్టి చూస్తే కలెక్షన్లు ప్రస్తుత పరిస్థితుల్లో రాబట్టడం అనేది అసాధ్యం కావటంతో .. ఈ సినిమాని సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రెండో భాగానికి తాను మాత్రమే కాక మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హెల్ప్ తీసుకోవడానికి సుక్కు రెడీ అవటం జరిగిందట. విషయంలోకి వెళితే ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మరెవరో కాదు తన శిష్యుడు “ఉప్పెన” సినిమా డైరెక్టర్ బుచ్చి బాబు హెల్ప్ తీసుకుంటున్నట్లు సమాచారం.
Read More: Pushpa : పుష్పలో లవర్ బాయ్..పార్ట్ 1 లోనా 2లోనా..?
రెండో భాగం చాలా కీలకం అన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి పార్టు లో గంధపు చెక్కల స్మగ్లర్ గా అల్లుఅర్జున్ కనిపిస్తే రెండో పాత్రలో గంధపు చెక్క స్మగ్లింగ్ చేసే సామ్రాజ్యానికి అధినేతగా బన్నీ కనిపించనున్నట్లు .. ఆ రీతిగా స్టోరీని సుకుమార్ మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండో భాగం తక్కువ టైంలో కంప్లీట్ చేయడం కోసం డైరెక్టర్ బుచ్చిబాబు హెల్త్ సుకుమార్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.