సోషల్ మీడియా హవా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే హాట్ ఫొటోలతో తమ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకునే వారే ఎక్కువ. ఈ కోవకు చెందిన ముద్దుగుమ్మే వాణీకపూర్. ఏడేళ్ల క్రితం హీరోయిన్గా బాలీవుడ్లో కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ అమ్మడు నాలుగు సినిమాలే చేసింది. అందులో తమిళ చిత్రం `ఆహా కల్యాణం` ఒకటి. రీసెంట్గా వార్తో మరో సక్సెస్‌ను దక్కించుకుంది. ఇప్పుడు ఐదో సినిమాను చేస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ తెలివిమీరన చురుకుదనమే ఈ అమ్మడుకి సమస్యలను తెచ్చి పెట్టింది. అదేంటంటే!.. శనివారం ఈ అమ్మడు రామ్ అనే అక్షరాలున్న స్పెషల్ డిజైన్డ్ బ్లౌజును ధరించి ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసుకుంది. అయితే దీనిపై హిందూవాదులు ఆగ్రహం తెచ్చుకుని ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో వాణీకపూర్ ఆఫొటోను తన ఇన్స్టాగ్రామ్ నుండి తొలగించింది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!