
Vaishnavi Chaitanya: బేబి సినిమాతో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండలు ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఇద్దరికీ సినిమా వేరువేరు ఇమేజ్ ఇచ్చినా కూడా బేబి సినిమాతో ఈ ఇద్దరూ ట్రెండ్ క్రియేట్ చేశారు. బేబీ సినిమా వేడుకల్లో పాల్గొనడానికి విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు. అర్జున్ రెడ్డి , గీత గోవిందం సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ ఇండియా మొత్తమ్ లో ప్రసిద్దికెక్కాడు. ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళు కూడా ఇతనికి విపరీతమైన అభిమానులైపోయారు. లిగెర్ ప్లాప్ అయ్యాక ఆ ఊపు కొంచం తగ్గింది. అందరు కలిసి ఒక ఫోటో తీసుకుంటుండగా వైష్ణవి తమ్ము డు కూడా వచ్చాడు. ఇప్పటికీ ఏదైనా ఫోటోలో విజయ్ దేవరకొండ కనిపిస్తే..
తాను మాత్రమే హైలెట్ అవుతుంటాడు. ఆ ఫోటోలో ఎంత మంది ఉన్నా కూడా అందరి కళ్లు విజయ్ దేవరకొండ మీద మాత్రమే పడుతుంటాయి. కానీ తాజాగా ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అందులో విజయ్ దేవరకొండ కన్నా ఎక్కువ గా జనాల దృష్టిని ఆకర్షించాడు ఒక అబ్బాయి . అతను బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య తమ్ముడు నితీష్ చైతన్య. విజయ్ పక్కన ఉన్నవాడే.. విజయ్ దేవరకొండ కన్నా పోజులు కొట్టాడు. తానే అసలు హీరో అన్నట్టుగా బిల్డప్, పోజు కొట్టేశాడు. ఆ ఫోటో మీద ఇప్పుడు నెటిజన్లు రకరకాల పంచ్ లు , కౌంటర్లు వేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు.

ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నెటిజన్లు సదరు వ్యక్తి మీద కౌంటర్లు వేస్తున్నారు. వీడేంటి? విజయ్ కన్నా తెల్లగా ఉన్నాడు అని ఒకడు.. అర్జున్ రెడ్డిలో ప్రీతి తమ్ముడులా లుక్ ఇచ్చాడు అని ఇంకొకడు.. వీడెవడు చైల్డ్ ఆర్టిస్టా? అంటూ మరొకడు.. యాటిట్యూడ్ చూపకు అంటూ మరి కొందరు కౌంటర్లు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి వైష్ణవి తమ్ముడు మాత్రం ఇలా ఫేమస్ అయిపోయాడు.
విజయ్ దేవరకొండతో వైష్ణవి తమ్ముడు ఫొటో దిగడం వరకు బాగానే ఉంది. కానీ, ఆ ఫొటోలో హీరోయిన్ తమ్ముడు నితిష్ చైతన్య (Nitish Chaitanya) చేసిన పనికి విజయ్ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. అంతలా అతను ఏం చేశాడంటే.. విజయ్ వెనుక నుంచి చేతులు వేసి హీరోలా పోజు ఇవ్వడమే. విజయ్ పక్కకు సాధారణంగా ఉంటే వైష్ణవి తమ్ముడు మాత్రం మధ్యలో హీరోలా స్టిల్ ఇచ్చాడు. ఇది విజయ్ ఫ్యాన్స్ కు అసలు నచ్చక అతనిపై తెగ ఫైర్ అయిపోతున్నారు. “నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? అలా విజయ్ పైనా చేయి వేసి పోజు కొడుతున్నావ్.. నీతో ఫొటో దిగేందుకు విజయ్, ఆనంద్ మీ ఇంటికి వచ్చారా? కొంచెం యాటిట్యూడ్ తగ్గించుకుంటే మంచిది” అని ఘాటుగా స్పందిస్తున్నారు.

సెలబ్రిటీలు తమ రాఖీ పండుగకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య సైతం రాఖీ పండుగ సందర్భంగా తన తమ్ముడు తనకు ఇచ్చిన బహుమతి గురించి చెప్పింది. అదేమిటంటే తమ్ముడు నితీష్ అక్క పేరును తన ఎడమ చేతి మీద టాటూ గా వేయించుకున్నాడు. ఆమె పుట్టిన రోజు ముందు ఆమె కు చూపాడు. ముందు అది నిజం టాటూ కాదేమో అనుకుంది వైష్ణవి. తర్వాత అది నిజమైనదే అని తెలిసి చాలా ఎమోషనల్ గా ఫీల్ ఐంది. అయితే ఈ బహుమతి తనకు ఎంతో విలువైనది గ చెప్పింది. రాఖీ పండుగ సందర్భంగా బహుమతి అడిగితె ఎడమ చేయి మీది టాటూ చూపిస్తున్నాడని చెప్పి నవ్వింది.
వైష్ణవి తమ్ముడు నితీష్ చాలా అందంగా ఉన్న విషయం అంటా గమనించారు. ఇతను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. యూట్యూబ్ లో వీడియో లు చేస్తుంటారు. ఇతను నటించిన చిన్న చిత్రాలు అనసూయకు పెళ్లి, క్షణం ఒక యుగమే, మరియు ప్రియతమా.

ఇతను వాళ్ళ అక్కతో కలిసి కూడా వీడియోస్ చేశారు. ఐతే ఇపుడు ఇతని అక్క యూట్యూబ్ వీడియో లు చేసే స్థాయిని దాటిపోయింది కదా. నితీష్ మంచి రంగు, అందం కలిగి ఉండడం వలన సినిమా ఛాన్స్ లు కూడా త్వర లోనే రావచ్చు కూడా. నితీష్ రూపు రేఖలు ఉత్తరాది వాళ్లకి కూడా నచ్చుతాయి. అందమైన హీరోయిన్ గారి అందమైన తమ్ముడు సినిమా లలో విజయం సాధించాలని ఆశిద్దాం.