
Vaishnavi Chaitanya: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద “బేబీ” సినిమా అనేక రికార్డులు సృష్టించటం తెలిసిందే. ప్రస్తుత సమాజంలో యూత్ నీ ఆకట్టుకునే రీతిలో తీసిన ఈ సినిమా చాలామంది ప్రముఖుల హృదయాలను టచ్ చేసింది. ఈ సినిమా విజయం సాధించటంతో ప్రత్యేకంగా సినిమా చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటీనటులను అభినందించడానికి మీడియా సమావేశం కూడా పెట్టడం విశేషం.
అదేవిధంగా సక్సెస్ మీట్ కి చిరంజీవి వచ్చి అందరిని అభినందించారు. యంగ్ టాలెంట్ ని ఎంతో ప్రోత్సహించారు. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చేసిన వైష్ణవి చైతన్య కి మొదటిలో నెగెటివిటీ రాగా.. తీరా ఆ పాత్రని అర్థం చేసుకున్నాక ఆమె నటనకు చాలామంది ఫిదా అయ్యారు. ప్రస్తుతం బేబీ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది.

ఈ క్రమంలో తొలిసారి వైష్ణవి చైతన్య తండ్రి కూతురు సినిమాని.. “ఆహా”లో చూడటం జరిగిందంట. ఈ క్రమంలో ఆయన ఊహించని రియాక్షన్ ఇవ్వడం జరిగిందంట. తన కూతురు నటన చూసి పొంగిపోయారంట. సినిమాలో కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉన్నా..నేపథ్యంలో అప్పట్లో థియేటర్లలో చూడటానికి సాహసించలేదు.

అయితే తాజాగా ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో చూసిన ఆయన బోర్డు సన్నివేశాలు చూసి కథను అర్థం చేసుకుని తప్పు బట్టలేదట. తన కూతురు నటన చూసి గర్వపడ్డారట. అంతేకాదు సినిమాలో అటువంటి సన్నివేశాలు ఉన్నాయని స్క్రిప్ట్ ఓకే చేయకముందు హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అడగటం జరిగిందంట.ఈ క్రమంలో స్టోరీ డిమాండ్ బట్టే ఆ రకంగా నటించడంతో.. వైష్ణవి చైతన్య తండ్రి బేబీ లో బోల్డ్ సన్నివేశాలు లైట్ తీసుకున్నారట.

ఇక ఈ సినిమా విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పెద్దపెద్ద ప్రాజెక్టులలో హీరోయిన్ అవకాశాలు వైష్ణవి చైతన్యకి వస్తున్నట్లు సమాచారం. అయితే పాత్ర ప్రాధాన్యతకు ఎక్కువ పెద్దపీట వేస్తూ ఓకే చేసే పనిలో ఉందంట. మరోపక్క బేబీ సినిమాకి సీక్వెల్ రాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలు వైష్ణవి చైతన్య టైం ఇప్పుడు నడుస్తోంది.