Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” ఫస్ట్ డే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ సిల్వర్ స్క్రీన్ పై కనపడటంతో మెగా అభిమానులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. మొదటి రెండు రోజుల కలెక్షన్ల లెక్కలు బట్టి ఈ సినిమా సరికొత్త లెక్కలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తిరగ రాయటం గ్యారెంటీ అని భావించారు. కానీ అంతలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థియేటర్ల టికెట్ల రేట్లు విషయంలో కఠినంగా వ్యవహరించడంతో..ఒక్కసారిగా “వకీల్ సాబ్” సినిమా కలెక్షన్లు కు చిల్లు పడినట్లు అయింది.
దీంతో 3, 4వ రోజు పెద్దగా కలెక్షన్లు రాని పరిస్థితి. సినిమా టికెట్ రేట్లు తగ్గించడంపై అభిమానుల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. పరిస్థితులు ఇలా ఉండగా… ఉగాది పండుగ నేపథ్యంలో ఐదవ రోజు సినిమాకి మొదటి రెండు రోజుల కంటే భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న టాక్. నేడు అంబేద్కర్ జయంతి కావటంతో ఈ రోజు కూడా కలెక్షన్లు వచ్చే పరిస్థితి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మొత్తంమీద చూస్తే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో .. నిర్మాతలు మళ్లీ డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ లోనే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏదిఏమైనా ప్రభుత్వ పరంగా సినిమా టికెట్ల విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకున్న గాని.. సినిమాకి ప్రస్తుతం వస్తున్న ఆదరణ చూస్తుంటే “వకీల్ సాబ్” జోరు ఏమాత్రం తగ్గలేదని ట్రేడ్ వర్గాలు నుండి అందుతున్న రిపోర్ట్.