Vakeel Saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ “వకీల్ సాబ్” ఏప్రిల్ 9న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇటీవల కొన్ని సంవత్సరాల పాటు రాజకీయంగా పవన్ బిజీ కావడంతో సినిమా రంగానికి దూరం కావటం ఆ తర్వాత మూడు సంవత్సరాలకు పవన్ “వకీల్ సాబ్” సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్న నేపథ్యంలో సినిమాపై మెగా అభిమానులు అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ “పింక్” సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో ..స్క్రీన్ మీద డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఏ విధంగా ప్రజెంట్ చేశారు అన్నది ఉత్కంఠగా మారింది.
ఆడవాళ్ళ అత్యాచారాలకు సంబంధించిన సినిమా కావటంతో బాలీవుడ్ పింక్ సినిమా లో లేని సన్నివేశాలు పవన్ కళ్యాణ్ హీరోయిజం చూపించడానికి అభిమానులను అలరించడం కోసం సరికొత్తగా జోడించినట్లు ఇండస్ట్రీ టాక్.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఫ్రీ ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ అవుతాయని.. ఆ సన్నివేశాలు చూసినప్పుడు తనకి రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని తాజాగా సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ చెప్పుకొచ్చారు.
ఆ సన్నివేశాలు ఇటీవల హోటల్ రూమ్ లో చూసిన టైం లో తన బ్యాగులో ఉన్న కాగితాలను స్క్రీన్ పై విసరటం జరిగిందని, అద్భుతంగా వచ్చాయని కచ్చితంగా ఫాన్స్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 9న సినిమా రిలీజ్ కానున్న క్రమంలో మార్చి 29న సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పవన్ అభిమానులు టైలర్ తో సినిమా రికార్డులు సోషల్ మీడియాలో సృష్టించాలని భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!