Vakeel Saab: ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని “వకీల్ సాబ్” సినిమాలో లాయర్ పాత్రలో అద్భుతంగా చూపించి మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్. దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఏ విధంగా చూడాలి అని అనుకున్నారో ఆ రీతిలో సిల్వర్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. బాలీవుడ్ “పింక్” సినిమా ఆడవాళ్లకు సంబంధించిన సినిమా కావడంతో.. తెలుగులో రీమేక్ కి పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా.. ఇటువంటిది ఎందుకు సెలక్ట్ చేసుకున్నారు అని అప్పట్లో అభిమానులు కొంత నిరుత్సాహం చెందారు.
కానీ సినిమా లో సబ్జెక్ట్ చెబుతూనే మరోపక్క పవన్ లో ఉన్న హీరోయిజం ఎలివేషన్ తారస్థాయిలో చూపించడంతో “వకీల్ సాబ్” సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ మెగా కాంపౌండ్ కి చెందిన మరో మెగా హీరోతో సినిమా చేస్తున్నట్లు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని గతంలో మిడిల్ క్లాస్ అబ్బాయి అనిల్ నాచురల్ స్టార్ నాని తో సినిమా చేయడంతో మరోసారి అతనితో సినిమా చేయడానికి వేణు శ్రీరామ్ డిసైడ్ అయ్యారట.
Read More: Vakeel Saab: సామాన్యుడికి తంటా తెచ్చి పెట్టిన వకీల్ సాబ్ మేటర్ ఏంటంటే ?
ఇటీవలే నానికి సినిమా స్టోరీ కూడా చెప్పినట్లు ఆయన కూడా ఓకే అయినట్లు .. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఎమ్.సి.ఏ సినిమా అప్పట్లో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్లు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?