Vakeel Saab : టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సినిమాలు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో అందరికీ తెలుసు. పవన్ సినిమా రిలీజవుతుందంటే మిగతా సినిమాలు వెనక్కి వెళ్లాల్సిందే. ఓపెనింగ్ లు బాగా రాబట్టే హీరోలలో మొదటి ప్లేస్ లో ఉంటాడు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉంటే దాదాపు మూడు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి దూరం కావడంతో… కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ట్రైలర్ మరియు స్టిల్స్ అదరగొట్టే రీతిలో ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకోవడంతో… పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ సరి కొత్తగా ఉండటంతో పాటు ఫస్ట్ టైం లాయర్ పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో… వెండితెరపై పవన్ ని మొట్ట మొదటి రోజు చూడటానికి అభిమానులు ఊహించని రీతిలో… ఫస్ట్ డే టికెట్లు భారీ ధరలకు కొన్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మొట్ట మొదటి రోజు ఇండస్ట్రీ బ్రేక్ రికార్డు ఆల్రెడీ “వకీళ్ సాబ్” క్రియేట్ చేయడం జరిగిందని.. టాక్ వినపడుతోంది.
ఏ మాత్రం పాజిటివ్ అనే టాక్ ఫస్ట్ షోకి పడితే వకీల్ సాబ్ ప్రభంజనం ఆపటం కష్టమని…ప్రస్తుతం టికెట్లు అమ్మకాల విషయంలో వస్తున్న వార్తలు బట్టి సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోపక్క కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా కొద్దిపాటి థియేటర్ లో అక్కడక్కడ రిలీజ్ కావటంతో ఉన్న తక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతున్న గాని భారీస్థాయిలో సినిమాకి సంబంధించి టికెట్లు అమ్ముడుపోయినట్లు టాక్.