పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ చిత్రానికి ఇది రీమేక్. అయితే తెలుగు వారి అభిరుచులకు అనుగుణంగా ఈ సినిమా కథకు మార్పులు చేర్పులు చేసాడు దర్శకుడు వేణుశ్రీరాం. మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా రాకపోయి ఉండి ఉంటే ఈపాటికి విడుదలైపోయేది.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మోషన్ టిజర్ ను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నారు. ఇప్పటికే సంగీత దర్శకుడు థమన్ దీనికి సంబంధించిన వర్క్ ను కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ షూటింగ్ ను వీలైనంత తొందర్లో పూర్తి చేసి సినిమాను విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడు.