Vakeel Saab : దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ట్రైలర్ రిలీజ్ కావడంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ దుమ్ము దులుపుతున్నరు. “వకీల్ సాబ్” సినిమా తో రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. ఈ తరుణంలో సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టిస్తోంది. అతి వేగంగా 100k లైకులు సాధించిన ట్రైలర్ గా 7 నిమిషాల్లో ఇండస్ట్రీలో రికార్డు సృష్టించింది. అదేవిధంగా 300k లైకులు కేవలం 39 నిమిషాల్లో రికార్డు సృష్టించిన అంతకుముందు ప్రభాస్ సినిమాలపై ఉన్న రికార్డులను పగలగొట్టాడు పవన్ కళ్యాణ్.
అంత మాత్రమే కాక రెండు మిలియన్ వ్యూస్ అతి కొద్ది నిమిషాల్లోనే పవన్ “వకీల్ సాబ్” రీచ్ అవ్వడం జరిగింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులను పగల కొడుతున్న ఈ ట్రైలర్.. ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి సత్తా చాటిన బాహుబలి సినిమా ట్రైలర్ రికార్డులను బద్దలు కొట్టేసింది. 500k కేవలం 117 నిమిషాలలో సాధించడం జరిగింది. ప్రస్తుతానికి 236 నిమిషాలలో 658 లైకులు సాధించిన కొత్త ట్రైలర్ సినిమాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో “వకీల్ సాబ్” సరికొత్త రికార్డు నెలకొల్పింది.
ఇంకా రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగులో రిలీజ్ మాత్రమే పవన్ కళ్యాణ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించిన సినిమా రికార్డులను పగలగొట్టడం .. తో పవన్ సత్తా ఏంటో మరోసారి రుజువైందని చాలామంది పేర్కొంటున్నారు. ఇతర హీరోలు ఆ స్థాయిలో రికార్డులు నెలకొల్పాలి అంటే పాన్ ఇండియా సినిమాలు చేయాలి, పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలు చేస్తే చాలు ఆటోమేటిక్ గా రికార్డులు క్రియేట్ అవుతాయని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?