Vakeel Saab : దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో పండగ వాతావరణం నెలకొంది. మహామారి వైరస్ ని సైతం లెక్కచేయకుండా థియేటర్ల వద్ద అభిమానులు బారులుతీరారు. సినిమా మొదటి షోకే పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ స్థాయిలో పవన్ రికార్డులు బద్దలు కొట్టడం గ్యారెంటీ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తమన్ భారీ స్థాయిలో ఇచ్చినట్లు.. సోషల్ మీడియాలో పవన్ అభిమానులు దండం పెట్టేస్తున్నారు. ప్రతి థియేటర్ లో భారీ స్థాయిలో ఆడియన్స్ సందడి చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించిన విజువల్స్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇదిలా ఉంటే పవన్ వీరాభిమాని గా పేరొందిన ఈ సినిమా నిర్మాత దిల్ రాజు కూడా థియేటర్ లో సందడి చేస్తూ పేపర్లు విసురుతూ.. మిగతా అభిమానులతో కలిసి పోయారు.
సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో సంతోషంగా ఉన్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడం 2013 తర్వాత సరైన హిట్ పడటంతో పవన్ అభిమానులు ఓ రేంజ్ లో కాలర్ ఎగరేస్తూ.. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు తిరగ రాస్తున్నాడు అంటూ సినిమా హిట్ పై తమ అభిమానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఆ రేంజిలో వకీల్ సాబ్ సినిమా విజయం సాధించిందని.. సినిమా చూసిన ఆడియన్స్ తెలియజేస్తూ ఉన్నారు. ఈ సినిమా విజయంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త లెక్కలు నమోదు కాబోతున్నాయి అని అంటున్నారు అభిమానులు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!