Vakeel Saab : అమెరికా లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన “వకీల్ సాబ్”..!!

Share

Vakeel Saab : పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా”వకీల్ సాబ్” 9వ తారీఖున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దాదాపు పవన్ మూడు సంవత్సరాల పాటు వెండితెరపై కనిపించకపోవడంతో చాలా గ్యాప్ రావటంతో ఈ సినిమా కోసం భారీ ఎత్తున హడావిడి ఏర్పాట్లు చేస్తున్నారు మెగా అభిమానులు. సినిమా పరంగా పవన్ పై వున్న అభిమానాన్ని చాటుతూ ఇప్పటికే సోషల్ మీడియాలో  “వకీల్ సాబ్”.. సినిమాల రికార్డులను అధిగమించడం జరిగింది.

Vakeel Saab sensational records in america
Vakeel Saab sensational records in america

“వకీల్ సాబ్” ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో… సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరోపక్క నిర్మాత దిల్ రాజు కూడా.. భారీ ఎత్తున సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అమెరికాలో ఈ సినిమా తాజాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే పాంటింగ్ తర్వాత… అమెరికాలో లో ఓ ప్రాంతీయ చిత్రం అత్యధిక స్క్రీన్ లలో ప్రదర్శింపబడుతున్న సినిమాగా”వకీల్ సాబ్”.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తూ ఉంది.

 

ఇప్పటికే అమెరికా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. టిక్కెట్టు లు హాట్ కేకులా పడిపోతుంది. 12 డాలర్ల నుండి 14 డాలర్ల వరకు టికెట్ రేటు ఉన్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్న నేపథ్యంలో మొదటి రోజు చూస్తే కిక్ వేరే గా ఉండటం తో… సెలబ్రిటీలు సైతం ఫస్ట్ డే వకీల్ సాబ్ చూడాలని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.


Share

Related posts

ఓటుకు తప్పని తిప్పలు

somaraju sharma

బిజెపిలో జూనియర్ మోడీ..!!

sekhar

‘అన్నీ అబద్దాలే’

somaraju sharma