Vakeel Saab: దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడటంతో అభిమానులు “వకీల్ సాబ్” సినిమాకి పోటెత్తుతున్నారు. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో..టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. 2013వ సంవత్సరంలో సూపర్ డూపర్ హిట్ అయిన “అత్తారింటికి దారేది” స్థాయిలో ఈ సినిమా విజయం సాధించడంతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగ రాస్తూ ఉన్నాడు పవన్. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురి అవ్వటం మాత్రమే కాక ప్రతి స్త్రీ చూడాల్సిన సినిమా అని హాలు బయట తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు.
చాలామంది ప్రముఖులు కూడా సినిమా చూసి సోషల్ మీడియాలో.. పవన్ టైం స్టార్ట్ అయింది అంటూ సినిమా పరంగా పవన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మొట్ట మొదటి రోజు ఈ సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ ఈ సినిమా సాధించినట్లు… పాండమిక్ సీజన్ లో ఏ సినిమా కూడా సాధించని విధంగా పవన్ “వకీల్ సాబ్” సాధించడంతో పవన్ ఫ్యాన్స్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో టాప్ ఓపెనింగ్ లు సాధించిన సినిమా లో టాప్ త్రీ స్థానాన్ని తాజాగా “వకీల్ సాబ్” సొంతం చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న టాక్. మొదటి స్థానంలో సాహోసినిమా ఉండగా రెండో స్థానంలో చిరంజీవి నటించిన సైరా ఉండగా తాజాగా మూడో స్థానంలో సరిలేరు నీకెవ్వరు సినిమా ని వెనక్కి నెట్టి “వకీల్ సాబ్” ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న టాక్. ఓవరాల్ గా సినిమా మరిన్ని రికార్డులు సాధించడం గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?