Big Boss Fame Hema : తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వదిన, అక్క, పిన్ని పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించి అందరినీ ఆకట్టుకున్న నటి హేమ అందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాలలో ఎంతో అద్భుతంగా నటించిన హేమ తాజాగా “అలీతో సరదాగా”కార్యక్రమానికి నటి శ్రీలక్ష్మి తో కలిసి హాజరయ్యారు. ఈ షో ద్వారా హేమ కొన్ని సినిమా విషయాలను గురించి తెలియజేయడమే కాకుండా, తన వ్యక్తిగత విషయాలను గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా హేమా మాట్లాడుతూ… సినిమాలలోకి రాకముందు ఒక డాన్స్ డైరెక్టర్ దగ్గర డాన్స్ లో శిక్షణ తీసుకుంది. హీరోయిన్ అవ్వాలనుకున్న హేమ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. మొట్టమొదటిగా హేమ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ, విజయశాంతి జంటగా నటించిన” భలేదొంగలు” సినిమాలో రావుగోపాలరావు కూతురు పాత్రలో నటించారు.
రాజోలులో జన్మించిన హేమ అసలు పేరు కృష్ణవేణి. భలే దొంగలు సినిమా ద్వారా తన సినీ ప్రస్థానం మొదలై ఇప్పటి వరకు ఎంతో అద్భుతంగా కొనసాగిస్తూనే ఉంది.ఇప్పటివరకు హేమ తెలుగులో వివిధ పాత్రలలో దాదాపు 475 చిత్రాల్లో నటించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక హేమ వ్యక్తిగత విషయానికి వస్తే తన భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్, వీరిద్దరికీ ఒక కూతురు కూడా ఉన్నారు.ఆమెను కూడా ఈ షో ద్వారా హేమ ప్రేక్షకులకు పరిచయం చేశారు.
హేమ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందా:
నటి హేమకు కూతురు ఒకటే సంతానం ప్రస్తుతం ఈమె BBA చదువుతోంది. ఎంతో క్యూట్ గా, అందంగా ఉన్న హేమ కూతురుఈ షో ద్వారా అలీను శ్రీలక్ష్మిని పలకరించింది. ఒక్కసారిగా హేమకు కూతురిని చూడగానే ప్రేక్షకులు హేమకు ఇంత అందమైన కూతురు ఉందా.. అని ఒక్క నిమిషం షాక్ కి గురయ్యారు. హేమ కూతురిలో హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ పూర్తిగా ఉండడంతో త్వరలోనే ఈమె కూడా వెండితెరపై హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా హేమ యాంకర్ ప్రదీప్ హీరోగా తెరకెక్కిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాలో ప్రదీప్ తల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు.