Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోలలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. “పెళ్లి చూపులు”తో మాదిరి హిట్ అందుకని ఆ తర్వాత “అర్జున్ రెడ్డి” తో ఊహించని బ్లాక్ బస్టర్ తో.. ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయాడు. ఆ తరువాత “గీతగోవిందం” తో అమ్మాయిలలో తిరుగులేని క్రేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ.. వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఇమేజ్ బాలీవుడ్ మొదలుకొని సౌత్ వరకు క్రియేట్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఆగస్టులో “లైగర్” రిలీజ్ కానుంది. వెంటనే పూరితో “జన గణ మన” ప్రాజెక్ట్ స్టార్ట్ చేయటం మాత్రమే కాదు మరోపక్క శివ నిర్వాణ దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ సినిమా స్టార్ట్ చేసేసాడు. ఇదిలా ఉంటే మే 9 వ తారీకు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన భర్త డేని ఉద్దేశించి విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన కామెంట్ పెట్టాడు. చాలామందికి నా బర్తడే ఒక సెంటిమెంట్ అయిపోయింది.
అందువల్లే నేమో నా బర్త్ డే నాడు చాలా సినిమాలకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. చూస్తుంటే ఒక పండుగ దినం లాగా ఉంది. అందరికీ మంచి జరగాలనీ కోరుకుంటూ నా శక్తులను ప్రసాదిస్తున్నాను అని వెరైటీ కామెంట్ పెట్టాడు. దీంతో విజయ్ దేవరకొండ పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మే 9 వ తారీకు విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రంతో పాటు మేజర్, ఎఫ్3, అంటే సుందరానికీ, పృథ్వీరాజ్ (బాలీవుడ్ చిత్రం) ప్రమోషన్ కార్యక్రమాలు.. ప్రారంభమవుతున్న క్రమంలో విజయ్ ఈ కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!