సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసే సినిమాలెప్పుడూ ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఆయన తన సినిమాలకు ఎంచుకునే కాన్సెప్ట్స్ అలా ఉంటాయి మరి. రీసెంట్ గా `లక్ష్మీస్ ఎన్టీర్` సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇది ముగియక ముందే కొత్త సంచలనానికి తెర తీశాడు వర్మ. ఆ సంచలనమే కోబ్రా. ఆసక్తికరమైన విషయమేమంటే వర్మ ఈ చిత్రంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. పోలీసులతో సంబంధాలు కలిగి ఉండి, ఆరాచకశక్తిగా ఎదిగిన ఓ క్రిమినల్ కథాంశంతో కోబ్రా సినిమా తెరకెక్కనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ క్రిమినల్ ను గ్రేహౌండ్స్ దళాలు తుద ముట్టించాయి. ఇంతకు ఆ క్రిమినల్ ఎవరో అర్థమయ్యే ఉంటుంది. అతనే … మాజీ మావోయిస్ట్, గ్యాంగ్ స్టర్ నయీం. ప్రభుత్వ వ్యతిరేక పనులను ఎన్నింటిలో చేసిన వాటిల్లో పోలీసులను కూడా ఇన్ వాల్వ్ చేసిన నయూంను తుదముట్టించడానికి ఏర్పాటు చేసిన ఆపరేషనే కోబ్రా. ఆ ఆపరేషన్ ను నిర్వహించిన అధికారిగా వర్మ కనిపించబోతున్నారు. సినిమా అంతా నయీంను పోలీసులు ఎలా హతమార్చారనే దానిపైపే సాగుతుందట.
previous post
next post