న్యూస్ సినిమా

RGV: పనిలో పస తగ్గిన వివాదాల వర్మ, వేదాలు వల్లించడం ఆపట్లేదు మరి?

Share

RGV: ఇటీవల రిలీజైన ‘కేజీయఫ్: చాప్టర్ 2’ సినిమా సక్సెస్ విషయంలో తరచూ మన వివాదాల డైరెక్టర్ RGV ఏదోఒకటి తన ట్విట్టర్ వేదికగా పోస్టు చేస్తూ వున్నాడు. ఈ క్రమంలో ఓ 2 సార్లు బాలీవుడ్ ని టార్గెట్ చేసారు కూడా. దాని తరువాత ఏకంగా మన టాలీవుడ్ బడా స్టార్లను టార్గెట్ చేస్తూ ఓ పోస్ట్ చేసాడు. అదేమంటే స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ తగ్గించుకొని దాన్ని కాస్త సినిమాపైనే పెట్టుబడిగా పెడితే KGF లాంటి సినిమాలు బయటకు వస్తాయని దాని సారాంశం. ఇక ఆ ట్వీట్ ఇలా పెట్టగానే నెటిజన్స్ RGVపైన విరుచుకు పడ్డారు.

RGV: RGV ట్వీట్ సారాంశం ఇదే:

”టాలీవుడ్ నిర్మాతలు హీరోల రెమ్యూనరేషన్ల కోసం డబ్బును అనవసరంగా వృధా చేయకుండా, మేకింగ్ కోసం ఖర్చు చేస్తే ‘కేజీఎఫ్ 2’ లాంటి మాన్ స్టర్ సినిమాలు వస్తాయి. ఒకసారి టాలీవుడ్ కూడా ఈ విషయంలో ఆలోచిస్తే బావుంటుంది!” అని ఓ ఉచిత సలహా పడేసాడు వర్మ. ఈ ట్వీట్ ద్వారా అత్యధిక పారితోషికాలు తీసుకునే స్టార్ హీరోలపై ఆర్జీవీ పరోక్షంగా సెటైర్ వేశారనే విషయం మనకు ఇట్టే అర్థం అవుతోంది కదా. ఇక ఈ విషయంలో నెటిజన్లు RGVని వ్యతిరేకించారు.

RGVని ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు:

పనిలేక ఖాళీగా వున్న వర్మ పిచ్చికూతలు కూయొద్దంటూ కొంతమంది ఘాటుగా సమాధానాలు ఇస్తున్నారు. తక్కువ డబ్బుతో సినిమాలు తీస్తున్న వర్మ ఎటువంటి గొప్ప సినిమాలు తీస్తున్నారో జనాలకు బాగా తెలుసనీ, ఇలాంటి సలహాలు ఇవ్వడానికి వర్మకు హక్కే లేదని కొందరు, మొన్నటికి మొన్న ఇలాంటి విషయమే ఏపీ ప్రభుత్వం లేవనెత్తితే విమర్శించిన వర్మ ఇపుడు అదే విషయానికి మద్దతు ప్రకటించడం ఊసరవెల్లి తత్వమని, వర్మకు రెండు కాదు ఓ 4, 5 నాలుకలు ఉన్నాయని.. ఇలా రకరకాలుగా వర్మపైన నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. మరి ఈ విషయాలపై వర్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి!


Share

Related posts

కేసిఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం..! అదేమిటంటే..?

somaraju sharma

Corona For Lions: మొదటి సారి సింహాలకు కూడా కరోనా నిర్ధారణ..హైదరాబాద్ జూపార్క్ లో ఆందోళన..

somaraju sharma

కడప ఉక్కుకు చంద్రబాబు శంఖుస్థాపన

sarath
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar