Varun Tej: `ఎఫ్ 2`, `గద్దలకొండ గణేష్` వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా మూవీ `గని`. కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ చిత్రం ద్వారా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద, అల్లు బాబీ కలిసి ఈ మూవీని నిర్మించారు.
ఇందులో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నదియా కీలక పాత్రలను పోషించారు. మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 8న విడుదలైన ఈ మూవీ.. తొలి రోజే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. టాక్ బిలో యావరేజ్‌గా ఉండటంతో బాక్సీఫీస్ వద్ద అంతంత మాత్రంగానే కలెక్షన్లను రాబట్టి.. నిర్మాతలకు, బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది.
అయితే గని సినిమా ఫ్లాప్ అవ్వడంతో.. వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఇంతకీ వరుణ్ ఏం చెప్పుకొచ్చాడంటే.. ` గత కొన్నేళ్ల నుండీ మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. గని మూవీకి పని చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నిర్మాతలకు ధన్యవాదాలు. మేమందరం మీకు మంచి చిత్రాన్ని అందించడానికి గని కోసం ఎంతో కష్టపడి పనిచేశాము. కానీ, పలు లోపాల వల్ల అనుకున్నట్లుగా ప్రాజెక్ట్ రాలేదు.
ఏదేమైనా నేను సినిమాకు పని చేసిన ప్రతిసారీ.. నా ఉద్దేశ్యం మిమ్మల్ని అలరించడమే. కొన్నిసార్లు నేను సక్సెస్ అవుతాను మరియు కొన్నిసార్లు నేను నేర్చుకుంటాను, కానీ నేను కష్టపడి పనిచేయడం ఎప్పటికీ ఆపను` అంటూ ట్విట్టర్ వేదికగా ఓ నోట్‌ను విడుదల చేశాడు. దీంతో అది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా, వరుణ్ ప్రస్తుతం `ఎఫ్ 3`తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ మరో హీరోగా నటించారు. సమ్మర్ కానుకగా మే నెలలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
— Varun Tej Konidela (@IAmVarunTej) April 12, 2022