మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ `ఎఫ్ 2` సక్సెస్ తర్వాత రెండు సినిమాలు చేయడానికి అంగీకరించారు. అందులో ఒకటి తమిళ చిత్రం `జిగర్ తండా` రీమేక్ `వాల్మీకి`. కాగా రెండో సినిమా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా. ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమా కోసం వరుణ్ పూర్తిగా లుక్ మార్చాల్సి వచ్చింది. బాక్సింగ్ కూడా నేర్చుకోవాల్సి ఉండటంతో.. వరుణ్ తేజ్ అమెరికాకు వెళ్లిపోయాడు. ఇంగ్లాండ్‌కు చెందిన ప్రొఫెషనల్ బాక్సర్ టోనీ డేవిడ్ జెఫ్రీస్ దగ్గర వరుణ్ తేజ్ .. రెండు నెలల పాటుప్రత్యేకంగా బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఒక బాక్సింగ్‌తో పాటు స్పెషల్ డైట్ కారణంగా వరుణ్ తేజ్ సన్నబడ్డాడు. సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా కంటే ముందుగా వరున్ ఈ నెలలోనే హరీష్ శంకర్ `వాల్మీకి` సినిమా షూటింగ్లో పాల్గొంటాడు.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!