Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) కొడుకు వరుణ్ తేజ్(Varun Tej) ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నరు. ఒకపక్క కామెడీ మరోపక్క మాస్ ఇంకా రొమాంటిక్ స్టోరీలు చేస్తూ తనదైన శైలిలో రాణిస్తున్నారు. “గద్దల కొండ గణేష్” వంటి పవర్ ఫుల్ మాస్ సబ్జెక్టు నీ అద్భుతంగా డీల్ చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. అంతకుముందు శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో “ఫిదా”(Fidaa) సినిమాలో సరికొత్త ప్రేమ కథ జోనర్ తో అదిరిపోయే విజయం అందుకోవటం జరిగింది. సోలో ఇమేజ్ మాత్రమే చూసుకోకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడంలో.. స్టోరీ బాగుంటే మల్టీ స్టార్వర్ సినిమాలు కూడా నిర్మొహమాటంగా వరుణ్ తేజ్ చేయడం విశేషం.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్(Venkatesh) తో “F3”.. ఇటీవల చేయడం తెలిసిందే. అంతకుముందు ఇదే కాంబినేషన్ లో “F2” చేయటం జరిగింది. రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేయడం జరిగింది. “F3” రాకముందు వరుణ్ తేజ్ “గని” చేయడం తెలిసిందే. ఈ సినిమాల్లో బాక్సర్ గా కనిపించాడు కానీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఇలా ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తూ స్టోరీలు ఎంచుకుంటున్న వరుణ్ తేజ్ ఇప్పుడు మరో కొత్త క్యారెక్టర్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం.
విషయంలోకి వెళ్తే ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. సినిమాలో వరుణ్ తేజ్ ఇంటర్నేషనల్ ఏజెంట్ గా కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ పాత్ర కోసం వరుణ్ తేజ్ తన లుక్ మొత్తం మార్చుకుంటున్నాడు. మరి కొద్ది రోజుల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్న క్రమంలో బరువు తగ్గే పనిలో వరుణ్ తేజ్ ఉన్నట్లు తీవ్రంగా జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!