Varun Tej Lavanya Tripathi engagement: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్థం హైదరాబాద్ మణికొండ లోని నాగబాబు నివాసంలో ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా కాని చేస్తున్నారు. కేవలం కొద్ది మంది సన్నిహితులు మెగా ఫ్యామిలీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు చిరంజీవితో పాటు రామ్ చరణ్, ఉపాసన.. ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. ఈ ఏడాది చివరిలో వీరి వివాహ వేడుక జరగనుంది. ఇక వీరిద్దరి లవ్ స్టోరీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 2017లో.. “మిస్టర్” సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి డేటింగ్ కు దారితీసింది.
అయితే ఆ ప్రేమ బయటికి పబ్లిసిటీ కాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరి రెండో సినిమా “అంతరిక్షం”… సమయంలో విషయం బయటపడింది. ఆ సమయంలో ఇద్దరు కలిసి పలు పార్టీలకు హాజరయ్యే వారు. ఆ తర్వాత వరుణ్ తేజ్ చెల్లెలు మెగా డాటర్ నిహారిక వివాహ వేడుకలో కూడా లావణ్య త్రిపాఠి సందడి చేసింది. దీంతో అప్పటినుంచి వీరిద్దరి రిలేషన్ పై వార్తలు మరింతగా వైరల్ అయ్యాయి. అయినా కానీ వీరిద్దరు ఎప్పుడు కూడా స్పందించను లేదు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ పెళ్లి.. ప్రతిపాదన తీసుకురాగానే లావణ్య త్రిపాఠి ఓకే చెప్పినట్టు సమాచారం. అనంతరం ఇరువురు కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు మాట్లాడుకోవడం జరిగిందట.
ఈ క్రమంలో ఈ ఏడాది చివరిలో వీరి వివాహం జరగనుందట. వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమాలో నటిస్తున్నాడు. ఆగస్టు 25వ తారీకు ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగాయి. దీంతోపాటు డబ్యూ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో మరో సినిమా కూడా చేస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి తమిళంలో అధర్వతో కలిసి సినిమా చేస్తుంది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై స్కైలాబ్ ఫెమ్ విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వంలో వెబ్ సిరీస్ చేస్తుంది.