Veera Simha Reddy: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న “వీరసింహారెడ్డి” ఫస్ట్ సింగిల్ సాంగ్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి నందమూరి అభిమానులను.. ఈ సాంగ్ ద్వారా అలరించాడు. “జై బాలయ్య” టైటిల్ తో విడుదలైన సాంగ్.. నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. ప్రతి లిరిక్ బాలయ్య వ్యక్తిత్వాన్ని సినిమా కథని తలపించే రీతిలో.. రామ జోగయ్య శాస్త్రి ఇచ్చిన లిరిక్స్.. దానికి తగ్గట్టు తమన్ అందించిన మ్యూజిక్… హృదయాలను కట్టిపడేస్తోంది.
1669353061.jpg)
గత ఏడాది ఇదే సమయంలో “అఖండ” సినిమా టైటిల్ సాంగ్ తో తమన్ మోత మోగించాడు. వరుస పరాజయాలలో ఉన్న బాలయ్యకి “అఖండ”తో అదిరిపోయే విజయం సాధించటం తెలిసిందే. సినిమా హిట్ అవ్వటంలో తమన్ అందించిన మ్యూజిక్ మేజర్ రోల్ పోషించింది. “అఖండ” బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి థియేటర్ లు దద్దరిల్లిపోయాయి. ఇప్పుడు ఇదే రీతిలో “వీరసింహారెడ్డి” ఫస్ట్ సింగిల్ ఉంది. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి తరహా లుక్ మాదిరిగా బాలయ్య కనిపిస్తున్నారు.

“రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ ఒంటి పేరు” అంటూ స్టార్ట్ అయిన ఈ సాంగ్… జై బాలయ్య లిరిక్స్ తో.. అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. పాట విడుదలైన కాసేపటికి సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్, కేజీఎఫ్ అవినాశ్ లు కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తున్నారు.