25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Veera Simha Reddy: వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుకలో…. కసి తీరలేదు అంటూ బాలయ్య సంచలన వ్యాఖ్యలు..!!

Share

Veera Simha Reddy: ఒంగోలులో నిన్న జరిగిన “వీర సింహారెడ్డి” ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. భారీ ఎత్తున నందమూరి ఫ్యాన్స్ ఈ కార్యక్రమానికి తరలిరావడం జరిగింది. జనవరి 12వ తారీకు సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా రిలీజ్ అవుతుంది. దీంతో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో “వీరసింహారెడ్డి” ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ లో బాలయ్య డైలాగ్స్. … గోపీచంద్ మల్లినేని టేకింగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సందర్భంగా ఈ వేడుకలో  బాలకృష్ణ మాట్లాడుతూ…”నందమూరి అభిమానులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చేసిందని చెప్పుకొచ్చారు.

Veera Simha Reddy pre-release ceremony Balayya sensational comments
Veera Simha Reddy

ఇదే సందర్భంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి ఎవరిని అతిథిగా పిలుద్దామని.. అనుకుంటుండగా ఈ వేదికను శాసించే హక్కు ఎవరికీ లేదు. నాకు ఎన్నో హిట్లు ఇచ్చిన ఒక బి.గోపాల్ కి ఉందని అందుకే ఆయనను ఆహ్వానించినట్లు బాలయ్య తెలియజేశారు. ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని గురించి మాట్లాడుతూ నటీనటుల టాలెంట్ వాడుకోవడంలో ఆయన శైలి వేరు. నిజంగా ఈ సినిమా నా కెరియర్ లో ఓ భైరవద్వీపం, ఆదిత్య 369, అఖండ సినిమాల మాదిరిగా హిస్టరీలో నిలిచిపోతుందని చెప్పకోచ్చారు. కాగా నా కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసిన కసి తీరలేదు. దీంతో రకరకాల పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాను. ఈ క్రమంలో అభిమానులకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించాలన్న తపన… నాన్నగారు నుండి నేను నేర్చుకున్నాను.

Veera Simha Reddy pre-release ceremony Balayya sensational comments
Veera Simha Reddy

ఇక శృతిహాసన్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆమె తండ్రి కమలహాసన్ మా తరంలో ఒక మార్గదర్శకమైన నటుడు. ఎన్నో విలక్షణమైన వైవిధ్యమైన సినిమాలు చేయడం జరిగింది. అటువంటి వ్యక్తి యొక్క కూతురు శృతిహాసన్ చాలా కష్టపడి పైకి వచ్చింది. కృషితో నాస్తి దుర్భిక్షం… లక్కీ హీరోయిన్ కంటే సక్సెస్ఫుల్ హీరోయిన్ కరెక్ట్. శృతిహాసన్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక హనీ రోజ్ తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. ఈ అమ్మాయిని చూడగానే భలే అమ్మాయిని పట్టారే అనిపించింది. ఈ అమ్మాయి సినిమాలో చేసిన పాత్ర గురించి నేను ఏమి చెప్పను. కానీ సినిమా చూసిన తర్వాత మీరే చెప్పుకుంటారు అంటూ బాలయ్య తెలియజేశారు. ఇక విలన్ పాత్రలో కన్నడ విజయ్ నటనపై కూడా ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి బాలయ్య అభినందనలు తెలియజేశారు. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.


Share

Related posts

samyuktha menon: `భీమ్లా నాయక్` వ‌ల్ల బాగా బాధ‌ప‌డ్డా.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

ప‌వ‌న్ త‌న‌యుడు అకీరాతో శేష్‌

Siva Prasad

Nivetha Thomas Latest Photos

Gallery Desk