VeeraSimha Reddy Special Song : గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా నటిస్తున్న సినిమా వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఎప్పటికీ ఈ సినిమాకి సంబంధించి రెండు పాటలు రిలీజ్ చేయడం జరిగింది. జై బాలయ్య, సుగుణ సుందరి అంటూ రిలీజ్ అయిన రెండు పాటలు అభిమానులకు మంచి కిక్కిచ్చాయి. దీంతో స్పెషల్ సాంగ్ అంటూ మూడో సాంగ్… “మా బావ మనోభావాలు” అనే సాంగ్ ఈరోజు రిలీజ్ చేశారు.

ఇది కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన సంగీతంకి సాహితీ చాగంటి, రేణు కుమార్, యామిని సాంగ్ నీ అదరగొట్టేలా పడేశారు. శేఖర్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ చేయడం జరిగింది. మాస్ బిట్ లతో థియేటర్ లలో మంచి ఊపు ఇవ్వడం గ్యారేంటి అని సాంగ్ విన్న వాళ్లు అంటున్నారు. ఇంకా ఈ సాంగ్ లో మలయాళ భామ హానీ రోజ్ కూడా ఈ సాంగులో ఉన్నట్టు అర్థం అయిపోతుంది. ఇంకా ఈ సాంగ్ లో హానీ రోజ్ తో పాటు ఆస్ట్రేలియన్ భామ చంద్రిక రవితో బాలయ్య నాట్ స్టెప్పులు వేయడం జరిగింది.
“మా బావ మనోభావాలు” దెబ్బతిన్నాయి అని మరదలు పాడే పాటగా. ఈ సాంగ్ చిత్రీకరణ ఉంది. అఖండ సినిమా విడుదల కావటం మరోపక్క అన్ స్టాపబుల్ షో దూసుకెళ్తూ గతంలో ఎన్నడూ లేని రీతిలో బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇక ఇదే సమయంలో వీర సింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని ఇండస్ట్రీలో ఒక్క పరాజయం కూడా లేదు. పైగా బాలయ్య అభిమాని కావడంతో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న..”వీర సింహారెడ్డి” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.