`వెంకీ మామ` ముందుకొచ్చేస్తున్నాడు


విక్ట‌రీ వెంక‌టేశ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `వెంకీమామ‌`. ఈ సినిమా రిలీజ్ విష‌యంలో క్లారిటీ రావ‌డం లేదు. సినిమాను డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నారు. అయితే అదే రోజున ఇత‌ర సినిమాలు పోటీకి రావ‌డంతో వెంకీమామ సంక్రాంతికి వ‌స్తాడ‌ని వార్త‌లు వచ్చాయి. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 29న విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ డేట్ విష‌యంగా అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది. కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని డి.సురేష్‌బాబు, టీజీ.విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.