సినిమా

ఎఫ్2 మ్యాజిక్ రిపీట్స్.. వెంకీ-వరుణ్ తేజ్ ‘ఎఫ్3’ డిటైల్స్ ఇవే..

venkatesh and varun tej new movie f3 announced
Share

సినిమా జోనర్స్ లో కామెడీ సినిమాలకు ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంటుంది. ఎంటర్ టైన్మెంట్ కి ప్రేక్షకులు ఎప్పుడూ ఫిదా అవుతారు. స్టార్ హీరోలెందరో కామెడీ చేసి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశారు. వారిలో విక్టరీ వెంకటేశ్ ఒకరు. తెలుగులో స్టార్ హీరోగా క్లాస్, మాస్, ఎంటర్ టైన్మెంట్ సినిమాలు చేశారు. కామెడీ టైమింగ్ లో వెంకీ ప్రత్యేకం. 2019 సంక్రాంతికి వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్2’ సంచలన విజయం నమోదు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపు వస్తోంది. డిసెంబర్ 13 వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆ వివరాలను తెలిపారు నిర్మాత దిల్ రాజు.

venkatesh and varun tej new movie f3 announced
venkatesh and varun tej new movie f3 announced

వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో ఎఫ్2కి కొనసాగింపుగా ‘ఎఫ్3’ తెరకెక్కుతోంది. ఈ విషయాల్ని సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. ‘ఎఫ్2లో భార్యా బాధితులుగా ఎన్ని తిప్పలు పడ్డామో చూశారు. ఇప్పుడు ఎఫ్3లో డబ్బుల కోసం ఎన్ని అవస్థలు పడతామో చూద్దురుగాని’ అంటూ వెంకటేశ్ ట్వీట్ చేశారు. ‘మళ్లీ మరింత ఫన్ తో వచ్చేస్తున్నాం’ అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. ‘Issue డబ్బులు అయినప్పుడు మరి ఫన్ peaks లొనే ఉంటుందిగా…అంతేగా అంతేగా…’ అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. మొత్తానికి ఎఫ్2 ఇచ్చిన కిక్కును.. ఎఫ్3లో మరింత కిక్కెస్తాం.. అంటూ టీమ్ హింట్ ఇచ్చేసింది.

దీంతో వెంకీ, మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వెయిటింగ్.. అంటూ మెసేజెస్ చేస్తున్నారు. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా ఎఫ్2 నిలిచింది. కలెక్షన్ల పరంగా, కంటెంట్ పరంగా సంక్రాంతికి టాప్ హిట్ మూవీగా నిలిచింది. వెంకీ కామెడీ టైమింగ్, వరుణ్ తేజ్ తెలంగాణ స్లాంగ్, తమన్నా, మెహరీన్ గ్లామర్, అనిల్ రావిపూడి స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే.. ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. చాన్నాళ్ల తర్వాత వెంకీలోని కామెడీ టైమింగ్ తో వచ్చిన సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. మరి.. ఎఫ్3 మరెంత ఫన్ ఇస్తుందో చూడాలి.

 


Share

Related posts

భారీ ఆఫర్ రెండు కోట్లు కూడా వద్దు మొహం మీద చెప్పేసిన సాయి పల్లవి..??

sekhar

Soundariya Nanjundan New Photos

Gallery Desk

పెళ్లి విష‌యం గ‌ట్టిగా అర‌చి చెబుతా.. కానీ, అంటూ ట్విస్ట్ ఇచ్చిన దేవ‌ర‌కొండ‌!

kavya N