క్రికెట్ ఆటను ఎక్కువగా ప్రేమించే హీరోల్లో వెంకటేష్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. హైదరాబాద్‌లో క్రికెట్ జరిగే ప్రతి సందర్భంలో వెంకీ గ్రౌండ్లో ప్రత్యక్షం అయ్యి ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇప్పుడు అదే ఆసక్తితో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇంతకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎందుకో తెలుసా.. క్రికెట్ ఆట ప్రధానంగా రూపొందిన `జెర్సీ` సినిమాకు ముఖ్య అతిథిగా రావడానికి. సినిమా క్రికెట్‌పై రూపొందడం.. నాని హీరోగా నటించడంతో వెంకీ యూనిట్‌ను అభినందించడానికి రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు.
నాని, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన `జెర్సీ` చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా ఈ సినిమాను నిర్మించారు.