venkatesh: సినీ పరిశ్రమలో వారసత్వం అనేది చాలా కామన్. బాలీవుడ్ టు టాలీవుడ్ ను చూసుకుంటే ఎందరో హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతల పిల్లలు సినీ గడప తొక్కారు. వారిలో కొందరు సక్సెస్ ఫుల్‌గా రాణిస్తుంటే.. మరికొందరు సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తనయుడు అర్జున్ దగ్గుబాటి సైతం సినీ గడప తొక్కబోతున్నాడంటూ గతంలో వార్తలు వచ్చాయి.
అర్జున్ డబ్యూను వెంకటేష్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా కుమారుడి సినీ ఎంట్రీపై వెంకటేష్ ఎవరూ ఊహించని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వెంకీ `ఎఫ్ 3`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది.
ఇందులో వెంకీ, వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా.. వారి సరసన తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లు చేశారు. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వెంకటేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా అక్కడ అడిగిన అన్ని ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు.
అయితే ఈ క్రమంలోనే యాంకర్ `మీ అబ్బాయి అర్జున్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు ?` అని ప్రశ్నించగా.. అందుకు వెంకీ `చదువుకుంటున్నాడు. ప్రస్తుతానికి అర్జున్ సినీ ఎంట్రీ గురించి ఎలాంటి ఆలోచనలు లేవు.` అంటూ బదులిచ్చారు. దాంతో అర్జున్‌ను హీరోగా చూడాలని భావిస్తున్న వెంకీ ఫ్యాన్స్ కాస్త కలవరపాటుకు గురయ్యారు.
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…
దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…
ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరీ జాగన్నాథ్ తెరకెక్కించిన…